AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pingali Venkayya: తెలుగు గడ్డపై జన్మించిన తెలుగు జాతి పుణ్యఫలం పింగళికు భారతరత్న ప్రకటించాలి.. పవన్ కల్యాణ్ డిమాండ్

భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 75 వసంతాలు పూర్తవుతున్న శుభతరుణంలో జాతి యావత్తు వజ్రోత్సవాలు జరుపుకోడానికి సమాయత్తమవుతున్న వేళ స్వర్గీయ పింగళి వెంకయ్య జయంతి కూడా జరుపుకోవడం మరుపురాని మహత్తర ఘట్టంమని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మహానుభావుని 146వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు.

Pingali Venkayya: తెలుగు గడ్డపై జన్మించిన తెలుగు జాతి పుణ్యఫలం పింగళికు భారతరత్న ప్రకటించాలి.. పవన్ కల్యాణ్ డిమాండ్
Pawan Kalyan On Pingali
Surya Kala
|

Updated on: Aug 03, 2022 | 1:43 PM

Share

Pingali Venkayya: జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య జయంతి నేడు. స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్యని యావత్ భారతం స్మరించుకుంటుంది.  జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మహానుభావుని 146వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. మూడు వర్ణాలతో మురిపించే భారత జాతీయ పతాకం. భారతీయుల ఏకత్వానికి, శౌర్యానికి, స్వాభిమానానికి, సార్వభౌమత్వానికి, సమున్నతకి ప్రతీక మన త్రివర్ణ పతాకం. త్రివర్ణ పతాకాన్ని వీక్షించిస్తే చాలు.. శరీరం రోమాంచితం కాని భారతీయులు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. అంతటి శక్తి కలిగిన పతాకాన్ని రూపొందించిన స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య చరితార్థులని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆ పతాక తపశ్శాలి తెలుగు గడ్డపై జన్మించడం తెలుగు జాతి పుణ్యఫలం. ఆ మహానుభావుని 146వ జయంతి  సందర్భంగా జనసేన పార్టీ తరపున నీరాజనాలు అర్పిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.  పింగళి వెంకయ్యకు భారతరత్న ప్రకటించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 75 వసంతాలు పూర్తవుతున్న శుభతరుణంలో జాతి యావత్తు వజ్రోత్సవాలు జరుపుకోడానికి సమాయత్తమవుతున్న వేళ స్వర్గీయ పింగళి వెంకయ్య జయంతి కూడా జరుపుకోవడం యాదృచ్చికమే అయినా అదొక మరుపురాని మహత్తర ఘట్టంమని పేర్కొన్నారు. దేశం పరాయి పాలనలో అరాచకాలను చవి చూస్తున్న తరుణంలో జాతిని ఏకం చేయడానికి దేశానికి ఒక పతాకం అవసరమని కాంగ్రెస్ సమావేశంలో గుర్తించి రూపొందించిన త్రివర్ణ పతాకం.

మహాత్మా గాంధీ ఆశీస్సులతో పింగళి రూపొందించిన త్రివర్ణ పతాకానికి భారత జాతీయ పతాకంగా ఆమోదం పొందింది. ఈ ఘడియల కోసం  పింగళి ఒక తపస్సునే చేశారంటూ పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. విద్యాధికుడు, వ్యవసాయం, భూగర్భశాస్త్రంలో నిపుణులైన పింగళి వెంకయ్య ను ఎందువల్లనో ఇటు తెలుగు రాజకీయ నాయకులు, అటు జాతీయ నాయకులు సరైన సమయంలో గుర్తించలేదన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తించకపోవడంతో ఆర్థికంగా దుర్భరమైన జీవితాన్ని చరమాంకంలో చవిచూశారు. ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటనగా పవన్ కళ్యాణ్ అభివర్ణించారు.

ఇవి కూడా చదవండి

గొప్పత్యాగశీలి పింగళికి ‘భారతరత్న’పురస్కారం అందించాలని తెలుగు ప్రజల కోరిక అని.. ఇప్పటి వరకూ నెరవేరలేదన్నారు జనసేనాని. దేశంలో ‘ఆజాది కా అమృతోత్సవ్’ వేడుకలు జరుగుతున్న ఈ శుభ ఘడియల్లో పింగళి వెంకయ్య సేవలకు గుర్తింపుగా భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ కోరారు.

మరిన్ని ఆంధ్రపదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ