AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: చిరంజీవిని చూసి అప్పుడే అనుకున్నా.! మరీ ఇంత పెద్ద హీరో అవుతాడనుకోలేదు

మెగాస్టార్ చిరంజీవి తొలినాళ్ల ప్రస్థానంపై నటి జయసుధ తన అనుభవాలను పంచుకున్నారు. చిరంజీవితో మొదటి చిత్రం నుంచి ప్రాణం ఖరీదు, రిక్షావోడు లాంటి సినిమాల వరకు ఆమె కలిసి నటించారు. చిరంజీవి రిజర్వ్‌డ్‌గా ఉన్నప్పటికీ, అప్పటి ఇతర హీరోలైన రామారావు, నాగేశ్వరరావు, శోభన్‌బాబుల కంటే భిన్నంగా కనిపించారని..

Chiranjeevi: చిరంజీవిని చూసి అప్పుడే అనుకున్నా.! మరీ ఇంత పెద్ద హీరో అవుతాడనుకోలేదు
Chiranjeevi
Ravi Kiran
|

Updated on: Mar 17, 2026 | 12:53 PM

Share

మెగాస్టార్ చిరంజీవి తొలినాళ్ల ప్రస్థానంపై నటి జయసుధ తన అనుభవాలను పంచుకున్నారు. చిరంజీవితో మొదటి చిత్రం నుంచి ప్రాణం ఖరీదు, రిక్షావోడు లాంటి సినిమాల వరకు ఆమె కలిసి నటించారు. చిరంజీవి రిజర్వ్‌డ్‌గా ఉన్నప్పటికీ, అప్పటి ఇతర హీరోలైన రామారావు, నాగేశ్వరరావు, శోభన్‌బాబుల కంటే భిన్నంగా కనిపించారని, పెద్ద హీరో అవుతారని అప్పుడే ఊహించానని జయసుధ తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి తొలినాళ్ల ప్రస్థానం గురించి తన జ్ఞాపకాలను పంచుకున్నారు. చిరంజీవితో తన మొదటి సినిమా అనుభవాన్ని వివరిస్తూ, అది తమిళంలో రజినీకాంత్ చేసిన పాత్రకు తెలుగు రీమేక్ అని పేర్కొన్నారు. ఆ చిత్రంలో జయసుధ, చిరంజీవి భార్యాభర్తలుగా నటించారు. ఆ తర్వాత ప్రాణం ఖరీదు లాంటి చిత్రాలలో కూడా ఇద్దరూ కలిసి పనిచేశారు. రిక్షావోడు సినిమాలో కూడా జయసుధ, చిరంజీవి పక్కన నటించారు.

చిరంజీవి తొలి రోజుల్లో కొద్దిగా రిజర్వ్‌డ్‌గా ఉండేవారని జయసుధ గుర్తుచేసుకున్నారు. అయితే, అప్పట్లోనే ఆయన కచ్చితంగా పెద్ద హీరో అవుతారన్న నమ్మకం తనకు ఉండేదని ఆమె స్పష్టం చేశారు. రామారావు, నాగేశ్వరరావు, శోభన్‌బాబు, కృష్ణరాజు వంటి అప్పటి ప్రముఖ నటుల నుంచి చిరంజీవి భిన్నంగా కనిపించారని జయసుధ అభిప్రాయపడ్డారు. ఈ ప్రత్యేకత వల్లే ఆయన పెద్ద హీరో అవుతారని తాను అంచనా వేశానని, అయితే ఇంత పెద్ద మెగా హీరో అవుతారని మాత్రం ఊహించలేదని జయసుధ తెలిపారు. ఇక ఇప్పుడు చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగాస్టార్‌గా, పెద్దన్నయ్యగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇది చదవండి: ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాస్తే.. అప్పు ఇచ్చినవాడు చనిపోయినా మీ డబ్బు వెనక్కి

Follow Us