AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : థియేటర్లలో అట్టర్ ప్లాప్.. అయినా 6 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సినిమా.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే..

భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఒక సినిమా డిజాస్టర్ అయ్యింది. కానీ ఇప్పుడు అదే సినిమా ఊహించని విధంగా ఏకంగా 6 ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. యాక్షన్, థ్రిల్ ప్రధాన అంశాలుగా తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రానికి IMDBలో 7.7 రేటింగ్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో వెతుకుతుకున్నారు నెటిజన్స్.

Cinema : థియేటర్లలో అట్టర్ ప్లాప్.. అయినా 6 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సినిమా.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే..
One Battle After Another Mo
Rajitha Chanti
|

Updated on: Mar 17, 2026 | 12:01 PM

Share

యాక్షన్ థ్రిల్లర్ డ్రామా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కానీ ఇప్పుడు అదే సినిమా కోసం ప్రపంచం మొత్తం వెతుకుతుంది. బాఫ్టా, గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలతోపాటు ఇప్పుడు ఆస్కార్ అవార్డుల వేడుకలో సత్తా చాటింది. థియేటర్లలో డిజాస్టర్ అయినప్పటికీ అంతర్జాతీయ వేదికపై అవార్డుల సునామీ సృష్టించింది. దాదాపు 2 గంటల 42 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుంది. ఈ సినిమాలోని ప్రధాన నటీనటులు, బీజీఎమ్ ఆకట్టుకుంది. తమ గతం తాలుకా పరిణమాలతో పోరాడుతున్న తండ్రీకూతుళ్ల కథను చెబుతుంది ఈ సినిమా.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Naresh: నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. ఒక్కో ఈవెంట్‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్..

వారి వర్తమానం ఇప్పటికే కష్టంగా ఉంటుంది. కానీ గతం నీడలు వారి జీవితాన్ని మరింత కష్టతరం చేస్తారు. ఇటీవల ఆస్కార్ వేడుకలో ఏకంగా 6 అవార్డులు అందుకున్న సినిమా పేరు వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఈ చిత్రానికి పాల్ థామస్ అండర్సన్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు ఆయన తీసిన చిత్రాలలో ఇది అత్యంత చర్చనీయాంశమైన వాటిలో ఒకటి. ఈ చిత్రంలో లియోనార్డో డికాప్రియో, సీన్ పెన్, బెనిసియో డెల్ టోరో, రెజీనా హాల్, టెయానా టేలర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకలో, ఈ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ కాస్టింగ్ విభాగాలలో అవార్డులను గెలుచుకుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..

అలాగే బాఫ్టా, గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం థియేటర్లలో పరాజయం పాలైంది. ఈ సినిమా బడ్జెట్ సుమారు 130 నుండి 175 మిలియన్ డాలర్లు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 209 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రం ఒకప్పుడు విప్లవకారుడైన బోబ్జీ కథను చెబుతుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా అతను ఇప్పుడు వ్యసనపరుడిగా మారాడు. అందరికీ దూరంగా, అతను తన కూతురితో ఒంటరి జీవితం గడుపుతుంటాడు. అలా ఉండగా, ఒక రోజు అతని పాత బద్ధశత్రువు తిరిగి అతని జీవితంలోకి ప్రవేశించి, అతని కూతురిని అపహరిస్తాడు. తర్వాత ఏం జరిగింది అనేది సినిమా. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..

Follow Us
6 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సినిమా..థియేటర్లలో అట్టర్ ప్లాప్.
6 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సినిమా..థియేటర్లలో అట్టర్ ప్లాప్.
వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి
వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి
రూ. 14 కోట్లు వచ్చాయని షికార్లు చేయకమ్మా.. అతడికి ధోనీ హితబోధ
రూ. 14 కోట్లు వచ్చాయని షికార్లు చేయకమ్మా.. అతడికి ధోనీ హితబోధ
పెళ్లిళ్లకు ముందు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగిన బంగారం, వెండి ధర
పెళ్లిళ్లకు ముందు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగిన బంగారం, వెండి ధర
సౌత్ కొరియన్ సింగర్స్‏తో సుకుమార్ కూతురు..
సౌత్ కొరియన్ సింగర్స్‏తో సుకుమార్ కూతురు..
విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలో తెలుసుకోండి
విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలో తెలుసుకోండి
భార్య దగ్గర దొరికిపోయిన బూమ్రా.. ఆటాడుకుంటున్న నెటిజన్లు
భార్య దగ్గర దొరికిపోయిన బూమ్రా.. ఆటాడుకుంటున్న నెటిజన్లు
ఓటీటీలో దుమ్మురేపుతున్న సాయి పల్లవి సస్పెన్స్ సినిమా..
ఓటీటీలో దుమ్మురేపుతున్న సాయి పల్లవి సస్పెన్స్ సినిమా..
అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ..
అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ..
కొత్త క్రెడిట్ కార్డు రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏప్రిల్ 1 నుంచే..
కొత్త క్రెడిట్ కార్డు రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏప్రిల్ 1 నుంచే..