Hyderabad: కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం నేడే.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ (Command Control Room) ప్రారంభానికి సిద్ధం కానుంది. ఇవాళ (గురువారం) మధ్యాహ్నం ఒంటిగంట 16 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ (Command Control Room) ప్రారంభానికి సిద్ధం కానుంది. ఇవాళ (గురువారం) మధ్యాహ్నం ఒంటిగంట 16 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరిగినా.. వెంటనే తెలుసుకునే విధంగా అత్యాధునిక టెక్నాలజీతో ఈ సెంటర్ ను నిర్మించారు. 2016లో శంకుస్థాపన కాగా.. రేయింబవళ్లు పని చేసి పూర్తి చేశారు. పోలీస్ శాఖలో వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులందరూ ఒకే చోట నుంచి క్రైమ్ మానిటరింగ్, కమాండ్ కంట్రోల్ చేసేందుకు వీలుగా ఈ సెంటర్ ను రూపొందించారు. విదేశీ సాంకేతికను వినియోగించుకుంటూ మోడరన్ టెక్నాలజీ పరిజ్జానంతో హైదరాబాద్ (Hyderabad), బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఈ భవనం నిర్మితమైంది. ఇవాళ్టి నుంచి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాలను నేరుగా పర్యవేక్షించనున్నారుర. కాగా.. హైదరాబాద్ లో ఇప్పటి వరకూ లా అండ్ ఆర్డర్ కు వేరు వేరు విభాగాలు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, ట్రాఫిక్ కు ప్రత్యేక విభాగం ఉంది.
భద్రత కోసం ఏర్పాటు చేసిన లక్షలాది సీసీ కెమెరాలను ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి లింక్ చేశారు. ఇందులోని నాలుగో అంతస్తులో అతిపెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేశారు. లక్షలాది సీసీ కెమెరాలను ఇక్కడి నుంచే వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 6.42 లక్షల ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో ఈ సెంటర్ ను నిర్మించారు. ఇందులో 4.26లక్షల ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో భవన నిర్మాణం, 2.16 లక్షల ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ సెంటర్ ను ఐదు విభాగాలుగా విభజించారు. అవి టవర్ ఏ, బీ, సీ, డీ, ఈ. మొదట టవర్ ఏలో 20 అంతస్తులు, ఇందులోనే హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనరేట్ ఉంటుంది. టవర్ బీలో మొత్తం 15 అంతస్తులు ఉంటాయి. ఇందులో డయల్ 100, షీ సేప్టీ, సైబర్ అండ్ నార్కోటిక్స్, క్రైమ్స్ విభాగాలు ఉంటాయి.
A truly world class Telangana State Police Integrated Command & Control Centre (TSPICCC) all set to be inaugurated by Hon’ble CM #KCR Garu tomorrow in Hyderabad
Possibly one of the most sophisticated Govt facility built by any Govt in India pic.twitter.com/pO5RkCjClV
— KTR (@KTRTRS) August 3, 2022
టవర్ సీలో నేరుగా 480 సిట్టింగ్ కెపాసిటీ కలిగిన ఆడిటోరియం ఉంది. టవర్ డీలో మీడియా, ట్రైనింగ్ సెంటర్ కు కేటాయించారు. టవర్ ఈ లో కమాండ్ కంట్రోల్, డేటా సెంటర్ ఏర్పాటు చేశారు. సీసీ టివీ మానిటరింగ్ తోపాటు వార్ రూమ్, రిసీవింగ్ రూమ్, హెలిపాడ్ ను ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే నేరుగా హెలికాప్టర్ లో వివిధ ప్రాంతాలకు చేరుకునే విధంగా విదేశీ సాంకేతికతను ఉపయోగిస్తూనే గ్రీన్ బిల్డింగ్ గా తీర్చిదిద్దారు. అత్యంత అధునాతన ప్రభుత్వ సదుపాయం భారతదేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్మించి ఉండదు. దేశంలో ఇలాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇదొక్కటే అయ్యి ఉంటుందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి