AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రేషన్ హోల్డర్స్ కు గుడ్ న్యూస్.. ఈ నెలల్లో ఫ్రీగా బియ్యం పంపిణీ.. కారణమేంటంటే

తెలంగాణ (Telangana) ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఆగస్టు నెల కోటాలో భాగంగా ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వాధికారులు ప్రకటన...

Telangana: రేషన్ హోల్డర్స్ కు గుడ్ న్యూస్.. ఈ నెలల్లో ఫ్రీగా బియ్యం పంపిణీ.. కారణమేంటంటే
Ration Rice In Telangana
Ganesh Mudavath
|

Updated on: Aug 04, 2022 | 11:12 AM

Share

తెలంగాణ (Telangana) ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఆగస్టు నెల కోటాలో భాగంగా ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వాధికారులు ప్రకటన వెల్లడించారు. ఇవాళ్టి (గురువారం) నుంచే బియ్యం అందిస్తామని తెలిపింది. అయితే.. కరోనా కారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేసేందుకు (Ration Rice) ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ కోటాను ప్రజలకు అందించలేదు. అంతేకాకుండా రాష్ట్రప్రభుత్వం తరఫున ఉచితంగా అందిచాల్సిన బియ్యాన్నీ ఇవ్వకుండా కిలోకు రూపాయి చొప్పున 6 కిలోలు పంపిణీ చేసింది. ఏప్రిల్, మే నెలల్లో ఉచితంగా పంపిణీ చేయని కారణంగా జులై నెలలో ఒక్కొక్కరికి10 కిలోలు అందించారు. కాగా.. ఆగస్టు నెలలో ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యాన్ని అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం అందించేందుకు ప్రభుత్వ అధికారులు సిద్ధమయ్యారు. పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం 15 రోజులపాటు కొనసాగి ఈ నెల 19న ముగియనుంది. అయితే ఆగస్టులోనే కాకుండా సెప్టెంబరులోనూ బియ్యం పంపిణీ చేసే అవకాశం ఉందని పౌరసరఫరాలశాఖ అధికారులు తెలిపారు. లబ్ధిదారులు బియ్యాన్ని ఎక్కడా విక్రయించవద్దని కోరారు. సాధారణ రోజుల్లో ప్రభుత్వం ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తోంది. ఈ నెలలో 15 కిలోల చొప్పున అందిచనున్నారు.

ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) ద్వారా మే, జూన్‌ నెలల్లో ఒక్కొక్కరికి 5 కిలోలు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవటంతో యథావిధిగా బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. అయితే.. తాజాగా ఆగస్టులో ఫ్రీగా ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 87.43 లక్షల మంది రేషన్‌కార్డుదారులకు ప్రయోజనం కలగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..