AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో వెంకీ అట్లూరి హ్యాట్రిక్ ఖాయమేనా?

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో వెంకీ అట్లూరి హ్యాట్రిక్ ఖాయమేనా?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 10, 2026 | 9:34 PM

Share

వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య, మమిత బైజు జంటగా నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ అంచనాలను పెంచుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్య లుక్, మమిత అల్లరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ధనుష్‌తో ‘సార్’, దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ విజయాల తర్వాత వెంకీ అట్లూరి మరో నాన్-లోకల్ హీరోతో వస్తున్నారు. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందా చూడాలి.

ఫ్యామిలీ జానర్‌ను మించిన సేఫ్ జోన్ మరోటి లేదు. ఎమోషన్స్ కాస్త వర్కవుట్ అయినా చాలు.. కాసుల వర్షం కురుస్తుంది. అందులో ఆరితేరిపోతున్నారు వెంకీ అట్లూరి. నాన్ లోకల్ హీరోలతో వరస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ విడుదలైంది. మరి ఇదెలా ఉంది.. ఈ చిత్రంతో వెంకీ హ్యాట్రిక్ పూర్తి చేస్తారా..? సూర్య, మమిత బైజు జంటగా నటిస్తున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ విడుదలైంది. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై తెలుగు, తమిళంలో అంచనాలు భారీగా ఉన్నాయి.. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచేసింది. ఫ్యామిలీ ఎమోషన్సే ప్రధానంగా విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాన్ని వెంకీ తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తేనే క్లారిటీ వచ్చేస్తుంది. తనదైన స్టైల్‌లో సున్నితమైన ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించారీయన. ముఖ్యంగా సూర్య లుక్స్, మమిత అల్లరి ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఒకప్పటి గజినీలోని సంజయ్ రామస్వామిని గుర్తు చేసారు సూర్య. పైగా ఇందులో కూడా ఆయన పేరు సంజయే. గత కొన్నేళ్లుగా వరసగా నాన్ లోకల్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు వెంకీ అట్లూరి. ధనుష్‌తో సార్, దుల్కర్ సల్మాన్‌తో లక్కీ భాస్కర్ చేసి విజయాలు అందుకున్నారు. ఇదే ట్రెండ్‌లో సూర్యతో పని చేసారిప్పుడు. ట్రైలర్ చూస్తుంటే.. వెంకీ అట్లూరి ఖాతాలో హ్యాట్రిక్ కన్ఫర్మ్ అనిపిస్తుంది. ఆగస్ట్ 14న విడుదల కానుంది విశ్వనాథ్ అండ్ సన్స్. చూడాలిక ఏం జరగబోతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రాఫిక్‌లో పైలట్‌.. విమానంలో 175 మంది ప్రయాణికులు

భారతీయ టెక్కీలకు బిగ్‌ షాక్‌.. గ్రేస్ పిరియడ్ రద్దు!

రెంట్ బాయ్‌ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల.. డిస్కౌంట్‌ ఆఫర్లతో నిండా ముంచేస్తున్నారు

Gold Prices: పసిడి ప్రియులకు షాక్‌.. బంగారం కొనాలా? వద్దా? నిపుణులు ఏం చెబుతున్నారు?

ఇంటి పెరట్లో అర్ధరాత్రి వింత ఆకారం..

Follow Us