లక్ష్మణ ఫలం ప్రయోజనాల గురించి విన్నారా..? కనిపిస్తే విడిచిపెట్టకండి..!
August 10
Jyothi Gadda
శరీరానికి డీహైడ్రేషన్ లేకుండా కాపాడుతుంది: లక్ష్మణ ఫలంలో 81.2 శాతం వరకు నీటి శాతం ఉంటుంది. వేసవిలో దీనిని తినడం వల్ల శరీరం కోల్పోయిన ద్రవాలు తిరిగి లభించి, ఎలక్ట్రోలైట్లు సమతుల్యంగా ఉంటాయి.
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది: ఇందులో ఉండే అధిక ఫైబర్ తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అజీర్తి, గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్యల నుంచి విముక్తిని ఇస్తుంది.
బరువు తగ్గడానికి తోడ్పడుతుంది: లక్ష్మణ ఫలంలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి ఆకలి తగ్గుతుంది, దాంతో బరువు త్వరగా తగ్గుతారు.
ఎముకలు, దంతాలను దృఢపరుస్తుంది: ఈ పండులో క్యాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి, వృద్ధాప్యంలో వచ్చే ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా కాపాడతాయి.
రక్తహీనతను తగ్గిస్తుంది: లక్ష్మణ ఫలంలో ఉండే ఐరన్ పోషకం శరీరంలో హిమోగ్లోబిన్ తయారీకి ఎంతగానో దోహదపడుతుంది. ఇది కొత్త రక్తం ఉత్పత్తికి తోడ్పడి అనీమియాను నివారిస్తుంది.
కండరాల నొప్పుల నుంచి ఉపశమనం: ఈ పండులోని మెగ్నిషియం ఒళ్ళు నొప్పులను తగ్గిస్తుంది. శారీరక శ్రమ చేసేవారికి, రాత్రి వేళల్లో పిక్కలు పట్టే సమస్య ఉన్నవారికి ఇది మంచి ఉపశమనం ఇస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ఇందులో సమృద్ధిగా లభించే విటమిన్ సి శరీర నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులపై పోరాడే శక్తిని అందిస్తుంది.
చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది: ఇందులోని విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలను తొలగించి చర్మానికి సహజమైన కాంతిని, నిగారింపును తీసుకొస్తుంది.