AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఆయుష్షును 30 ఏళ్లు పెంచే సూపర్ సీక్రెట్.. ఋషుల రహస్యాలు పాటిస్తే వందేళ్లు బతకం పక్కా..

దీర్ఘాయుష్మాన్ భవ.. ఇది మన పెద్దలు ఇచ్చే గొప్ప దీవెన. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో 60 ఏళ్లు దాటడమే గగనమైపోతోంది. ఆధునిక వైద్య సౌకర్యాలు పెరిగినా, సగటు మనిషి ఆయుష్షు మాత్రం క్రమంగా క్షీణిస్తోంది. దేశంలో సగటు ఆయుష్షు 65-70 ఏళ్లకే పరిమితం కాగా నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం శ్రమించే వైద్యుల సగటు ఆయుష్షు కేవలం 59 ఏళ్లు మాత్రమేనని నివేదికలు చెబుతున్నాయి. మరి 150 ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవించిన మన ప్రాచీన రుషుల రహస్యం ఏమిటి? మన శరీర అవయవాల సామర్థ్యం నిజంగానే అంత త్వరగా ముగిసిపోతుందా..

Krishna S
|

Updated on: Mar 17, 2026 | 9:23 AM

Share
శాస్త్రీయ రహస్యం: మనిషి ఆయుష్షును నిర్ణయించే కీలక అంశం మన కణ కేంద్రకంలోని 23 జతల క్రోమోజోమ్‌లలో దాగి ఉంది. ఈ క్రోమోజోమ్‌ల చివరి భాగంలో ఉండే రక్షణ కవచాల వంటి నిర్మాణాలను టిలోమియర్లు అంటారు. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. ఈ టిలోమియర్ల పొడవు ఎంత ఎక్కువగా ఉంటే మనిషి ఆయుష్షు అంత ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ లేదా తప్పుడు జీవనశైలి వల్ల ఈ టిలోమియర్లు క్షీణిస్తూ ఉంటే ఆయుష్షు కూడా తగ్గిపోతుంది. మన ప్రాచీన రుషులు తమ జీవనశైలి ద్వారా ఈ టిలోమియర్ల పొడవు తగ్గకుండా రక్షించుకోగలిగారు.

1 / 5
ఆహార నియమం: రుషులు ప్రకృతి సిద్ధమైన విత్తనాలు, పండ్లు, కాయలను మాత్రమే స్వీకరించేవారు. రోజులో కేవలం 8 గంటల వ్యవధిలోనే ఆహారం తీసుకోవాలి. మిగిలిన 16 గంటలు ఉపవాసం ఉండటం వల్ల కణాలు తమను తాము శుద్ధి చేసుకుంటాయి. తీసుకునే ఆహారంలో 70శాతం జ్యూస్‌లు, సలాడ్‌లు, మొలకెత్తిన విత్తనాలు ఉండాలి. వండిన ఆహారాన్ని 30 శాతానికి పరిమితం చేయడం వల్ల టిలోమియర్ల పొడవు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

2 / 5
యోగ - ప్రాణాయామం: ప్రాణాయామం అంటే కేవలం శ్వాస తీసుకోవడం కాదు, అది కణాల పునరుజ్జీవనం. ప్రతిరోజూ 20 నిమిషాల ప్రాణాయామం, ఒక గంట యోగా అభ్యసించడం వల్ల క్రోమోజోమ్‌ల చివర ఉండే టిలోమియర్లు దెబ్బతినకుండా రక్షించబడతాయి. ఇది కణ స్థాయిలో వృద్ధాప్యాన్ని అడ్డుకుంటుంది.

3 / 5
ధ్యానం: ఒత్తిడి అనేది టిలోమియర్లకు అతిపెద్ద శత్రువు. ప్రతిరోజూ ధ్యానం చేయడం వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి, టిలోమియర్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉదయం అరగంట, పడుకునే ముందు 10 నిమిషాల ధ్యానం దీర్ఘాయుష్షుకు పునాది వేస్తుంది.

4 / 5
నిండు నూరేళ్లూ మన చేతుల్లోనే: పెద్దల దీవెనలు నిజం కావాలంటే, కేవలం ఆశీర్వాదం ఉంటే సరిపోదు.. ఆచరణ కూడా ఉండాలి. రుషులు అందించిన ఈ విజ్ఞానాన్ని పిల్లలకు చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే వారు కేవలం వంద ఏళ్లు మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ కాలం సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలరు. మన కణాల రూపకల్పనే 150 ఏళ్ల కోసం జరిగినప్పుడు, అకాల మరణం పాలవ్వడం మన జీవనశైలి వైఫల్యమే తప్ప శరీరానిది కాదు.

5 / 5
Follow Us