AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Addiction: పిల్లలు ఫోన్‌లను వదలట్లేదా.. పేరెంట్స్ ఇవి పాటిస్తే చాలు.. వారు మళ్లీ వాటి జోలికెళ్లరు!

ఈ మధ్య కాలంలో పిల్లలు ఫోన్‌ వాడకం ఎక్కవగా పెరిగిపోయింది. గంటల తరబడి వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం వంటివి వారి దినచర్యలో భాగంగా మారాయి. అయితే చెడు వ్యసనాల వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయో.. ఫోన్‌లకు అడెక్ట్‌ కావడం వల్ల కూడా పిల్లలపై అదే స్థాయిలో ప్రభావం పెరుగుతుందని నిపుణులు చెబుతారు. కాబట్టి పిల్లలు ఫోన్లపై అధిక సమయం గడపకుండా ఉండటానికి, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం

Phone Addiction: పిల్లలు ఫోన్‌లను వదలట్లేదా.. పేరెంట్స్ ఇవి పాటిస్తే చాలు.. వారు మళ్లీ వాటి జోలికెళ్లరు!
Parental Guide To Screen Time Addiction
Anand T
|

Updated on: Mar 17, 2026 | 10:55 AM

Share

సెల్ ఫోన్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఇది ఒక నిత్యావసర వస్తువుగా మాత్రమే కాకుండా చేతికి ఆభరణంలా మారిపోయింది. పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ మొబైల్ ఫోన్ల వాడకానికి అలవాటుపడ్డారు. పిల్లలైతే ఇంట్లో ఉన్నంతసేపు ఫోన్లకు అతుక్కుపోతున్నారు. వీడియోలు చూస్తూ, గేమ్లు ఆడుతూ గంటల తరబడి ఫోన్లపైనే గడుపుతున్నారు. దీనివల్ల పిల్లలు ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. పిల్లల్లో ఈ వ్యసనానికి అడ్డుకట్ట వేయడానికి తల్లిదండ్రులు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

మార్పు మీలో మొదలవ్వాలి

ముందుగా, తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లలు కూడా వాటినే ఫాలో అవుతారనే విషయం పేరెంట్స్ గుర్తుంచుకోవాలి. పెద్దలు పిల్లల ముందు ఫోన్లు వాడటం, టీవీలు చూడటం తగ్గించుకోవాలి. వారితో మాట్లాడటం, ఆడుకోవడం, కబుర్లు చెప్పడం వంటివి అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తారు. పిల్లలు టీవీ, ఫోన్లను వాడుతున్నప్పుడు వారిని గమనిస్తూ ఉండాలి. వారి పర్యవేక్షణలోనే వారు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఏదైనా సినిమా అయినా, షో అయినా పిల్లలతో కలిసి తల్లిదండ్రులు కూడా చూడాలి.

సాంకేతికత నైపుణ్యం పెంపు

కేవలం వినోదం కోసం కార్టూన్లు కాకుండా, అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుని విజ్ఞానం అందించే విషయాలను పిల్లలకు తెలియజేయాలి. నేటి తరం పిల్లలకు సాంకేతికత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా తెలుసు అని చెప్పాలి. అందువల్ల తల్లిదండ్రులకు ఏం తెలియదు అనుకుంటే, పిల్లలు తప్పులు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా సాంకేతికత గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. పిల్లలకు ప్రతి విషయం గురించి తెలుసుకుని వివరించాలి.

ఏడుస్తున్నారని ఫోన్‌ ఇవ్వడం తప్పు

పిల్లలు కాస్త అల్లరి చేయగానే లేదా ఏడుపు ఆపడానికి కొందరు తల్లిదండ్రులు ఫోన్ ఇస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని పిల్లల్లో ఏడ్చి మరీ ఫోన్ తీసుకోవాలనే ధోరణి పెరుగుతుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. పిల్లలు ఏడ్చినా, అలిగినా వారికి ఏం కావాలో అడిగి తెలుసుకోవాలి. వారితో కాసేపు ప్రేమగా మాట్లాడాలి.

టైమ్‌లైన్

అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులను వాడుకోవడానికి ఇంట్లో ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవాలి. ఇంట్లో అందరూ ఆ సమయంలో తమ తమ పనులు పూర్తి చేసుకోవాలనే నిబంధన పెట్టాలి. ఆ తర్వాత అందరూ కలిసి ఉండేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల పిల్లలకు ఒక పద్ధతి ప్రకారం అన్ని పనులు చేసుకునే విధానం అలవడుతుంది. దీనివల్ల వారు ఫోన్లకు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు బానిసలుగా మారకుండా ఉంటారు.

మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us