AP News: వద్దన్నా.. డబ్బులు వేసి మరి వేధిస్తున్నారు.. లోన్‌ యాప్స్‌ ఆగడాలపై బాధితుడి ఫిర్యాదు..

కేసులైనా, అరెస్టులైనా డోంట్‌ కేర్‌ అంటున్నాయ్‌ లోన్‌ యాప్స్‌. ఒకపక్క అరెస్టులు జరుగుతున్నా తగ్గేదే లేదంటూ వేధింపులు కొనసాగిస్తున్నాయ్‌. ఓ లోన్‌ యాప్‌ బెదిరింపులు భరించలేక ఏపీలో పోలీసులను ఆశ్రయించాడు ఓ బాధితుడు.

AP News: వద్దన్నా.. డబ్బులు వేసి మరి వేధిస్తున్నారు.. లోన్‌ యాప్స్‌ ఆగడాలపై బాధితుడి ఫిర్యాదు..
Loan Apps
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 04, 2022 | 7:07 AM

Loan Apps Harassment: ఆంధ్రప్రదేశ్‌లో లోన్స్‌ యాప్స్‌ ఆగడాలు ఆగడం లేదు. లోన్స్‌ అయినా, రికవరీ అయినా ఆర్బీఐ రూల్స్‌ ప్రకారమే చేయాలంటూ ప్రభుత్వం, పోలీసులు వార్నింగ్‌ ఇస్తున్నా డోంట్ కేర్‌ అంటున్నాయ్‌ లోన్‌ యాప్స్‌. నందిగామ హరిత సూసైడ్‌ కేసులో నిందితులను అరెస్ట్‌చేసి హెచ్చరికలు పంపినా లోన్‌ యాప్స్‌ నిర్వాహకులు తగ్గేదే లేదంటున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ బాధితుడు, లోన్‌ యాప్‌ వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించాడు. టీబీటీ కాలనీలో ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ నడుపుకునే శ్యామ్‌ కుమార్‌ అడగకపోయినా లోన్‌ ఇచ్చిన వెల్‌ క్రెడిట్‌ లోన్‌ యాప్‌ సంస్థ, వడ్డీల వడ్డీలేస్తూ డబుల్‌ అమౌంట్‌ వసూలు చేసింది. వద్దన్నాసరే రెండోసారి, మూడోసారి అకౌంట్‌లో డబ్బులేసి కట్టాలని వేధించడంతో శ్యామ్‌ కుమార్‌ పోలీసులను ఆశ్రయించాడు.

మొదట, శ్యామ్‌ కుమార్‌ మొబైల్‌ ఫోన్‌కి లింక్‌ పంపింది వెల్‌ క్రెడిట్‌ లోన్‌ యాప్‌ సంస్థ. ఆ తర్వాత అతనికి ఫోన్‌ చేసి ఆ లింక్‌ ఓపెన్‌ చేయమని చెప్పింది. నీ క్రెడిట్‌ స్కోర్‌ బాగుంది, లోన్‌ ఇస్తామంటూ మాటలతో బోల్తాకొట్టింది. 9వేలు అకౌంట్‌లో జమచేసింది. ఆ తర్వాత రెండ్రోజులకే అసలు, వడ్డీ కలిపి 16వేలకు పైగా కట్టించుకుంది. మళ్లీ 14వేలు జమచేసి 26వేలు కట్టించుకున్నారు. మూడోసారి 16వేలు వేసి 30వేలు కట్టాలని వేధింపులకు దిగడంతో పోలీసులను ఆశ్రయించానని శ్యామ్‌ కుమార్‌ చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే