AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP EAPCET 2026: విద్యార్ధులకు అలర్ట్.. ఏపీ ఈఏపీసెట్‌ 2026 దరఖాస్తు గడువు మళ్లీ పెంపు! ఎప్పటి వరకంటే..

రాష్ట్ర ఈఏపీసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మరోసారి పొడిగించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఈ రోజుతో (మార్చి 17) రిజిస్ట్రేషన్‌ గడువు ముగియనుంది. ఈ క్రమంలో తాజాగా ఈ గడువును మార్చి 24, 2026వ తేదీ వరకు మరోమారు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది..

AP EAPCET 2026: విద్యార్ధులకు అలర్ట్.. ఏపీ ఈఏపీసెట్‌ 2026 దరఖాస్తు గడువు మళ్లీ పెంపు! ఎప్పటి వరకంటే..
AP EAPCET Registration deadline
Srilakshmi C
|

Updated on: Mar 17, 2026 | 2:26 PM

Share

అమరావతి, మార్చి 17: ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మరోసారి పొడిగించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఈ రోజుతో (మార్చి 17) రిజిస్ట్రేషన్‌ గడువు ముగియనుంది. ఈ క్రమంలో తాజాగా ఈ గడువును మార్చి 24, 2026వ తేదీ వరకు మరోమారు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఎలాంటి ఆలస్య రుసుములేకుండా అభ్యర్ధులు మార్చి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానిక అవకాశం ఉంటుంది. ఈ మేరకు జేఎన్‌టీయూ కాకినాడ ప్రకటన వెలువరించింది. ఈఏపీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా 206-27 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్‌ ప్రొఫెషనల్‌ కాలేజీల్లో ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కాగా ఏపీ ఈఏపీసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు మే 12 నుంచి 20 మధ్య జరగనున్న సంగతి తెలిసిందే.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఏపీ ఈఏపీసెట్‌ 2026 దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 24, 2026.
  • రూ 1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 28 వరకు
  • రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 1 వరకు
  • రూ.4000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 6 వరకు
  • రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 10 వరకు
  • దరఖాస్తు సవరణ తేదీలు: ఏప్రిల్‌ 11 నుంచి 13 వరకు
  • హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ తేదీ: ఏప్రిల్‌ 28 నుంచి
  • ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు నిర్వహించే తేదీలు: మే 12, 15, 18 తేదీల్లో
  • అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షలు నిర్వహించే తేదీలు: మే 19, 20 తేదీల్లో
  • ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ విడుద తేదీ: మే 23, 2026.
  • ఈఏపీసెట్‌ ఫలితాల విడుదల తేదీ: జూన్‌ 1, 2026.

ఏపీ ఈఏపీసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us