Ugadi 2026: ఈ ఉగాదికి వేప పువ్వు కరువు.. కీడు సంకేతమేనా? మరి, వేపకు బదులుగా ఏది వాడాలి
ఉగాది పచ్చడిలో వేప పువ్వులను పక్కా వేస్తాము. అది వెయ్యనిదే పచ్చడి పూర్తి కాదు. మరి, ఈ ఏడాది వేపపువ్వు దొరకడమే చాలా కష్టంగా ఉంది. వేప పువ్వుకు ప్రత్యామ్నాయంగా ఉగాది పచ్చడిలో ఏం ఉపయోగించాలన్న దాని పై జనాలు ఆలోచిస్తున్నారు.

వేప చెట్లకు ఏమైంది. పుష్కలమైన ఆక్సిజన్ ఇచ్చే ఆ చెట్లు ఎందుకు ఎండి పోతున్నాయి. ఆ వైరస్ కీడు సంకేతమేనా? ఈసారి ఉగాది పచ్చడికి వేపపువ్వు బంగారమేనా? ఎన్నో ఔషధ లక్షణాలు కలిగి.. దైవ స్వరూపాలుగా భావించే వేపచెట్లకు ఏమైంది.. ఎందుకలా ఎండిపోతున్నాయి. వృక్ష శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు. వేప పువ్వుకు ప్రత్యామ్నాయంగా ఉగాది పచ్చడిలో ఏం ఉపయోగించాలి. వేపచెట్లను వెంటాడుతున్న వైరస్ భయం.
భారతీయ సంప్రదాయం, ఆయుర్వేదంలో పేర్కొన్న ప్రాథమిక రుచులు ఆరు.. వాటిని సుఖదుఃఖాలకు ప్రతీకలుగా భావిస్తారు.. చడ్రుచులతోనే ఉగాది పచ్చడి తయారుచేసి తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఆ మిశ్రమాన్ని స్వీకరించడం ఆనవాయితీగా కొనసాగుతుంది..
షడ్రుచులు అంటే తీపి,పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు తో ఉగాది పచ్చడి తయారుచేసి స్వీకరించడం ఆనవాయితీ. వీటిలో తీపిని సంతోషానికి ప్రతీకగా, పులుపు అంటే చింతపండు విరక్తికి ప్రతీకగా, ఉప్పును రుచి ఆసక్తికి ప్రతీకగా, బావిస్తారు.. కారం అంటే మిరియాలను కోపం- ఉత్తేజంకు ప్రతీకగా బావిస్తారు.. చేదు అంటే వేపపువ్వు ను బాధ- కష్టం కు ప్రతిరూపంగా బావిస్తారు. వగరు అంటే మామిడి పిందెను కొత్తదనానికి ప్రతీకగా బావిస్తారు.
తెలుగు సంవత్సరాది ఉగాది రోజున చడ్రుచుల మిశ్రమాన్ని స్వీకరిస్తే ఆ ఆరు రుచుల లాగే మనజీవితం ఉంటుందనేది ప్రతి ఒక్కరి నమ్మకం.. కానీ ప్రస్తుతం ఆరు రుచులలో ఈసారి చేదు దూరమవుతుంది.. వేప చెట్లను వింత వైరస్ వెంటాడుతుంది.. గత ఐదేళ్లుగా వేపచెట్లకు సోకుతున్న వైరస్ ఈసారి మరింత ఎక్కువ ప్రభావం చూపింది.. ప్రస్తుతం వేప చెట్లు మొత్తం ఎండిపోయి ఏదో కీడు సంకేతంగా జనంలో ఆందోళన కనిపిస్తోంది.
తెలుగు క్యాలండర్ ప్రకారం 19వ తేదీన ఉగాది పర్వదినం కానీ ప్రస్తుతం వేపచెట్టుకు ఒక్క వేప పువ్వు కూడా కనిపించడం లేదు. ఆకులు, కొమ్మలతో సహా మొత్తం ఎండి పోయాయి.దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉగాది పండుగకు ఈసారి వేప పువ్వు ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.వేపపువ్వుకు ప్రత్యామ్నాయంగా చేదు స్థానంలో ఇలాంటి పదార్థాలు వాడాలి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. ఇప్పటికే వేద పండితుల వద్దకు జనం పరుగులు పెడుతున్నారు. ఉగాది పచ్చడిలో వేపపువ్వుకు బదులు ఇలాంటి పదార్థాలు వాడాలినే సందేహాలు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.. వేపపువ్వు కు బదులు తులసి ఆకులు వాడాలని పండితులు సూచిస్తున్నారు.
ఉగాది చరిత్రలో ఎప్పుడులేని విధంగా ఈసారి వింత సమస్య వెంటాడుతుంది.. వేప చెట్లు మొత్తం ఎక్కడికక్కడే ఎండిపోయి విషాద వాతావరణం కనిపిస్తుంది. వాటిని ముట్టుకుంటే ఏదో వైరస్ సోకుతుందనే భయం ప్రజలలో కనిపిస్తోంది..ఇది కీడు సంకేతంగా గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు..
అయితే ఈ ఉగాదికి వేపపువ్వు ఎలా..? అసలు వేపచెట్లకు ఏమైంది..?వేపచెట్లను మాత్రమే సోకిన వైరస్ తో మనసులు ప్రాణాలకు ముప్పుందా..? అనే ప్రశ్నలు ప్రజలను బెంబేలెత్తిపోయేలా చేస్తున్నాయి.. వేప చెట్టు శాస్త్రీయనామం “అజాడిరిచ్టా ఇండికా”.. ఎన్నో ఔషధగుణాలు కలిగిన వేపను.. హైందవ సంప్రదాయంలో దేవతగా పూజిస్తారు.. గ్రామీణ పొలిమేర దేవతలు పోచమ్మ, మైసమ్మ, పోలేరమ్మ దేవతలు అన్ని వేపచెట్ల వద్దే ఉంటాయి.. శివసతులకు పూనకాలు రావాలన్న వాళ్ళ చేతిలో నాలుగు వేపరిల్లలు ఉండాల్సిందే..
వేపచెట్టు లేని ఊరంటూ ఉండదు..దైవ స్వరూపంగా భావించే వేపచెట్లలో లెక్కకు మించిన ఔషధగుణాలు ఉంటాయి.. ఆయుర్వేద వైద్యంలో రారాజు వేపచెట్టు.ముఖ్యంగా డయాబెటిస్, చర్మ సంబంధిత వ్యాధులు, దంత వ్యాధులు నివారణకు వేపతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రీయంగా రుజువైంది.. ఇంకా సోప్స్ తయారీ, కాస్మోటిక్స్, ఔషధాల తయారీలో వేపను ఉపయోగిస్తారు.
అసలు వేపచెట్లకు సోకిన వైరస్ ఏంటి? వీటివల్ల మనుషులకు ఏదైనా ముప్పుఉందా? ఉగాది పచ్చడికి ఈసారి వేపపువ్వు కరువేనా? అనే సందేహాలు ఆందోళన కలిగిస్తున్నాయి. షడ్రుచులలో చేదు దూరమైన ఈ ఉగాది. ఒక చేదు జ్ఞాపకానంగానే మిగిలి పోతుంది.. ఈ వైరస్ భయాన్ని తొలగించి కీడు సంకేతాల నుండి జనానికి నివృత్తి కల్పించాల్సిన అవసరం ఉంది..
