AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూల్‌డ్రింక్స్‌తో పనిలేదు.. ఈ 3 సూపర్ ఫుడ్స్‌ తింటే మీ బాడీలో కూలర్ ఉన్నటే.. డే మొత్తం కూల్ కూల్

తెలుగురాష్ట్రాల్లో భూనుడు భగ్గుమంటున్నాడు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఎండలను ఎదుర్కొని మన శరీరాన్ని కూల్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో మనం మన శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కూల్‌డ్రింక్స్ కాకుండా మన బాడీని కూల్‌గా ఉంటే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కూల్‌డ్రింక్స్‌తో పనిలేదు.. ఈ 3 సూపర్ ఫుడ్స్‌ తింటే మీ బాడీలో కూలర్ ఉన్నటే.. డే మొత్తం కూల్ కూల్
Summer Cooling Foods
Anand T
|

Updated on: Apr 17, 2026 | 12:25 PM

Share

సమ్మర్ వచ్చేసింది. బయట ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణో్గ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పెరుగుతున్న ఎండల తీవ్రతను తట్టుకోవడానికి చాలా మంది కూల్‌ డ్రింక్స్‌ ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ ఇవి కొద్ది సేపు మాత్రమే మన బాడీని హైడ్రెడ్‌గా ఉంచుతాయి. కాబట్టి మన శరీరాన్ని రోజంతా కూల్‌గా ఉంచే ఆహారాలు ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో మన వంటింట్లో ఉండే కొన్ని మసాలా దినుసులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సాధారణంగా మసాలాలు వేడి చేస్తాయని మనం అనుకుంటాం, కానీ కొన్ని దినుసులు మన బాడీకి ‘నేచురల్ కూలర్లు గా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సమ్మర్‌ శరీరాన్ని కూల్‌గా ఉంచూ మూడు సూపర్ ఫుడ్స్ ఇవే

సోంపు గింజలు: చాలా మంది సోంపును మౌత్ ఫ్రెషనర్‌గా, తిన్న ఆహారం ఆరగడానికి తింటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, పొట్టలోని గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. దీని మన రోజు వారి ఆహారంలో చేర్చు్కోవడం చాలా సులభం. ఇందుకోసం ఒక స్పూన్ సోంపును గ్లాసు నీటిలో మరిగించి, చల్లారాక తాగితే శరీరం తక్షణమే చల్లబడుతుంది. అలాగే తిన్న తర్వాత కొద్దిగా సోంపు నమలడం వల్ల నోటి దుర్వాసన పోవడమే కాకుండా శరీరానికి లోపలి నుండి చల్లదనం అందుతుంది. అంతేకాదు దీనిని పొడిగా చేసుకొని తాజా సలాడ్లపై చల్లుకుంటే రుచితో పాటు బాడీ కూడా కూల్ అవుతుంది.

ధనియాలు : పచ్చి కొత్తిమీర అయినా లేదా ఎండు ధనియాలైనా, శరీర వేడిని తగ్గించడంలో ఇవి తిరుగులేనివి. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి పొట్టకు ఉపశమనాన్ని ఇస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకునేందుకు ఒక చెంచా ధనియాలను రాత్రంతా గ్లాసు నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేయడం ద్వారా డే మొత్తం బాడీని కూల్‌గా ఉంచుకోవచ్చు. అలా కాకుండా తాజా కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, నిమ్మరసంతో చట్నీ చేసుకుని తింటే వడదెబ్బ నుండి రక్షణ లభిస్తుంది.

యాలకులు: యాలకులు మంచి సువాసనతో పాటు సహజ సిద్ధమైన శీతలీకరణ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి, వేసవిలో వచ్చే అజీర్తిని దూరం చేస్తాయి. వీటిని మన ఆహారంలో చేర్చుకునేందుకు నిమ్మరసం, షర్బత్ లేదా చల్లని టీలో యాలకుల పొడిని కలిపి తీసుకోవచ్చు. లేదా ఇంట్లో చేసుకునే లస్సీ, స్మూతీలు లేదా ఐస్‌క్రీమ్‌లలో చిటికెడు యాలకుల పొడి వేస్తే రుచితో పాటు చల్లదనం కూడా పెరుగుతుంది. అలాగే చల్లని పాలలో కొంచెం యాలకుల పొడి కలిపి తాగితే శరీరానికి ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది.

Note: వేసవిలో ఎండల నుండి తప్పించుకోవడానికి కేవలం ఏసీలు, కూలర్లపైనే కాకుండా, ఇలాంటి సహజమైన పద్ధతులపై కూడా దృష్టి పెడితే ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us