AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో మణితేజ్‌.. చిన్న కాటే ప్రాణాలు తీసింది.. రూ.70 లక్షలు ఖర్చుపెట్టినా..

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుక్క కాటు కారణంగా మణితేజ్ అనే చిన్నారి ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో విషాదాన్ని నింపింది. సుమారు 15 నెలల పాటు ఆస్పత్రుల్లో చికిత్స అందించినప్పటికీ.. బాలుడి ప్రాణం దక్కకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు..

అయ్యో మణితేజ్‌.. చిన్న కాటే ప్రాణాలు తీసింది.. రూ.70 లక్షలు ఖర్చుపెట్టినా..
Dog bite death Jagitial
G Sampath Kumar
| Edited By: |

Updated on: Mar 17, 2026 | 2:38 PM

Share

జగిత్యాల కోటిలింగాల గ్రామానికి చెందిన మణితేజ్‌ను 2024 డిసెంబర్ 26న ఒక కుక్క కరిచింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాలుడిని సమీప ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. మొదట్లో పెద్దగా ప్రమాదం లేదని భావించిన కుటుంబానికి.. కొద్ది రోజుల తరువాత బాలుడి ఆరోగ్యం క్షీణించడం ఆందోళన కలిగించింది. అనారోగ్య లక్షణాలు కనిపించడంతో బాలుడిని మళ్లీ వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. రేబీస్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.

బాలుడి ప్రాణాలను కాపాడేందుకు పలు ఆస్పత్రులతో చికిత్స చేయించారు. చికిత్స కోసం కుటుంబం తీవ్రంగా శ్రమించింది. దాదాపు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఖర్చు చేసినప్పటికీ.. బాలుడి ఆరోగ్యం మెరుగుపడలేదు. 15 నెలల పాటు ప్రాణాలతో పోరాడిన మణితేజ్ చివరకు మృతి చెందాడు. ఈ విషాదంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ ఘటనతో కోటిలింగాల గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గ్రామస్థులు బాలుడి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న కాటు.. ఒక కుటుంబాన్ని చిదిమేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు ఈ ఘటనపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కుక్క కాటు జరిగిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే యాంటీ రేబీస్ టీకాలు వేయించుకోవాలని సూచించారు. పూర్తి స్థాయిలో చికిత్స చేయించకపోతే రేబీస్ ప్రాణాంతకమవుతుందని పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2026 ఫలితాల తేదీలు చూశారా?
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2026 ఫలితాల తేదీలు చూశారా?
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం