AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఏంటీ మేడమ్.. ఇది మీరేనా.. అప్పుడెప్పుడో కనిపించారు.. మళ్లీ ఇన్నాళ్లకు ఇలా..

ఒకప్పుడు తెలుగులో ఎక్కువగా పాపులారిటీ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. అందం, అమాయకత్వం, అటు ట్రెడిషనల్.. ఇటు గ్లామరస్ పాత్రలలో తనదైన నటనతో మెప్పించింది. ఒకటి రెండు చిత్రాలతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమాలకు దూరమైంది. తాజాగా ఆమె లేటేస్ట్ ఫోటోషూట్ వైరలవుతుంది. అందంలో, లేటేస్ట్ లుక్ లో ఇప్పటికీ ఏమాత్రం మార్పులేదు.

Tollywood: ఏంటీ మేడమ్.. ఇది మీరేనా.. అప్పుడెప్పుడో కనిపించారు.. మళ్లీ ఇన్నాళ్లకు ఇలా..
Sindhu Menon
Rajitha Chanti
|

Updated on: Jun 10, 2026 | 4:12 PM

Share

ఒకప్పుడు టాలీవుడ్‌లో తన అందం, అభినయంతో కుర్రకారు మనసు దోచుకున్న ముంబై బ్యూటీ సింధు తులానీ (Sindhu Tolani) గుర్తున్నారా? తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె, ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ సరికొత్త జీవితాన్ని గడుపుతున్నారు. 2003లో వచ్చిన సంచలన చిత్రం ‘ఐతే’ ద్వారా సింధు తులానీ తెలుగు తెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఆమె, ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ‘అతనొక్కడే’ సినిమాలో నటించి కెరీర్‌లోనే అతిపెద్ద కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తెచ్చిన క్రేజ్‌తో టాలీవుడ్‌లో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ‘గౌతమ్ SSC’, ‘పౌర్ణమి’, ‘పోతేపోనీ’, ‘హరేరామ్’ వంటి చిత్రాల్లో కథానాయికగా మెరిశారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో వచ్చిన ‘బతుకమ్మ’ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను కూడా అలవోకగా పోషించారు.

ఎక్కువ మంది చదివినవి : Sirivennela Sitaramasastri : మనిషి జీవితంలో ఎదగటానికి ఈ లక్షణాలు ఉంటే చాలు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి..

హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన తర్వాత సింధు తులానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. నితిన్ హీరోగా వచ్చిన ‘ఇష్క్’ సినిమాలో అతనికి అక్కగా, అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో వదిన పాత్రలో కనిపించి మెప్పించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఆమె నటించారు. 2011 తర్వాత ఆమె సినిమాల వేగం తగ్గించి, చివరగా 2017లో ఒక చిత్రంలో కనిపించిన అనంతరం ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: ఒకప్పుడు లవర్ బాయ్.. వడ్డె నవీన్ కొడుకును చూశారా.. ? వైరలవుతున్న ఫోటోస్..

ప్రస్తుతం ఏం చేస్తున్నారు?

సినీ రంగానికే కాకుండా సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉండటంతో ఆమె గురించి అభిమానులకు ఎలాంటి సమాచారం తెలియరాలేదు. అయితే, తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సింధు తులానీ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన చేతన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె చలనచిత్ర ప్రపంచపు వెలుగు జిలుగులకు దూరంగా, తన కుటుంబంతో కలిసి సాధారణమైన, సంతోషకరమైన గృహిణి జీవితాన్ని గడుపుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..

సింధు తులానీ లేటేస్ట్ ఫోటోస్..

ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..

Follow Us
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు