AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వావ్.. డీమార్ట్ కంటే తక్కువ ధరలు.. ఈ స్టోర్లలో సూపర్ ఆఫర్స్.. నెలకు మస్త్ పైసల్ ఆదా..

నెల వచ్చిందంటే చాలు.. సరుకుల కోసం డీ మార్ట్ లైన్లలో నిలబడి ఆఫర్ల కోసం వెతకడం మనందరికీ అలవాటే. కానీ ఇకపై ఆ క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదని తెలుసా? డిమార్ట్‌ కంటే తక్కువ ధరకే, పైగా ఇంటి తలుపు తట్టి సరుకులు ఇచ్చే సరికొత్త ఆప్షన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. బడ్జెట్‌లో వేల రూపాయలు ఆదా చేసే వాటి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వావ్.. డీమార్ట్ కంటే తక్కువ ధరలు.. ఈ స్టోర్లలో సూపర్ ఆఫర్స్.. నెలకు మస్త్ పైసల్ ఆదా..
How To Cut Your Grocery Bill In Half
Krishna S
|

Updated on: Jul 25, 2026 | 7:03 PM

Share

ఇంటికి కావలసిన నిత్యావసర సరుకులు అనగానే మనదేశంలో అందరికీ ముందుగా గుర్తొచ్చేది డిమార్ట్. తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు దొరుకుతాయనే నమ్మకంతో ప్రతి నెలా అక్కడ క్యూ లైన్లలో నిలబడటం అలవాటైపోయింది. అయితే మారుతున్న డిజిటల్ యుగంలో ఆ పరిస్థితి వేగంగా మారుతుంది. మార్కెట్లోకి వచ్చిన పలు కొత్త టెక్నాలజీ యాప్‌లు, మోడరన్ రిటైల్ విభాగాలు ఇప్పుడు డిమార్ట్‌కు గట్టి సవాలు విసురుతున్నాయి. ధరల విషయంలో పోటీ పడటమే కాకుండా కస్టమర్ల సమయాన్ని ఆదా చేసే సరికొత్త వెసులుబాట్లను అందిస్తున్నాయి.

ఆన్‌లైన్ స్టోర్స్

షాపింగ్ రంగంలో ప్రస్తుతం పెను సంచలనం సృష్టిస్తున్నవి క్విక్ కామర్స్ యాప్‌లు. ఆర్డర్ చేసిన పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలోనే ఇంటి తలుపు తట్టే బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి యాప్‌లు, నిత్యావసర ఉత్పత్తులపై ప్రత్యేకమైన క్రాష్ డీల్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. సమయం ఆదా కావడంతో పాటు రవాణా ఖర్చులు కూడా మిగులుతుండటంతో చాలా మంది వీటివైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు జియో మార్ట్ ఏకంగా ఎంఆర్‌పీపై 40 శాతం వరకు ఆఫర్లు ఇస్తూ, ఉచిత డెలివరీతో డిమార్ట్‌కు గట్టి పోటీనిస్తోంది. నాణ్యమైన ఆర్గానిక్ సరుకుల కోసం బిగ్ బాస్కెట్ తమ ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తులపై మంచి డిస్కౌంట్లు ఇస్తుండగా.. అమెజాన్ ఫ్రెష్ , ఫ్లిప్‌కార్ట్ గ్రాసరీ పండుగలు, నెలాఖరు ఆఫర్లు, బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.

ఆఫ్‌లైన్ స్టోర్స్

కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లే కాకుండా నేరుగా వెళ్లి కొనుగోలు చేసే ప్రత్యక్ష స్టోర్లలోనూ అనేక ప్రత్యామ్నాయాలు వచ్చాయి. విశాల్ మెగా మార్ట్‌లో కిరాణాతో పాటు దుస్తులు, హోమ్ అప్లయన్స్ డిమార్ట్ కంటే తక్కువ ధరలకే దొరికే సందర్భాలు ఉన్నాయి. అలాగే రిలయన్స్ స్మార్ట్ బజార్ నిర్వహించే ఒకటి కొంటే ఒకటి ఉచితం ఆఫర్లు మధ్యతరగతి జేబుకు పెద్ద ఊరటనిస్తున్నాయి. ఇక పెద్ద ఎత్తున బల్క్ కొనుగోళ్లు చేసే కుటుంబాలకు మెట్రో హోల్‌సేల్ వంటి చోట్ల దక్కే హోల్‌సేల్ రేట్లు డిమార్ట్‌ ధరల కంటే తక్కువగా ఉంటున్నాయి.

స్మార్ట్ షాపింగ్

ఒకప్పుడు తక్కువ ధర అనగానే డిమార్ట్ ఒక్కటే మార్గం అనుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. వినియోగదారులు షాపింగ్ చేసే ముందు ఆన్‌లైన్ యాప్‌లలో లభించే కార్డ్ ఆఫర్లు, ఉచిత డెలివరీ కూపన్లతో పాటు ఆఫ్‌లైన్ ఆఫర్లను పోల్చి చూసుకుంటే.. సమయంతో పాటు ప్రతినెల వేల రూపాయల బడ్జెట్‌ను సులువుగా ఆదా చేసుకోవచ్చు.

Follow Us