ఇప్పుడు అమ్మ నా పక్కన ఉంటే బాగుండేది.. నా సక్సెస్ చూడకుండానే వెళ్లిపోయింది.. గౌరీ ప్రియ ఎమోషనల్..
చెన్నై లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది శ్రీ గౌరీ ప్రియ. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సరసన ఆమె నటించిన ఈ సినిమా జూలై 24న థియేటర్లలో విడుదలై పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది గౌరీ ప్రియ..

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటాగా నటించిన లేటేస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ. జూలై 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన నేపథ్యంలో శ్రేయాస్ మీడియా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో కథానాయిక శ్రీ గౌరీ ప్రియ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ విజయం తనకెంతో ప్రత్యేకమని, కొంత భావోద్వేగంగా ఉన్నానని ఆమె తెలిపారు. తన దివంగత తల్లిని గుర్తుచేసుకుంటూ, తన సక్సెస్ తన తల్లి చూసుంటే ఎంతో సంతోషించేవారని పేర్కొన్నారు. అయితే, తన తల్లి తనను చూస్తోందని, ఆమె ఆశీస్సుల వల్లే ఈ పేరు వచ్చిందని గౌరీ ప్రియ అన్నారు. తల్లిదండ్రుల మద్దతు లేకుండా తాను ఏదీ సాధించలేనని, తన తండ్రికి కూడా కృతజ్ఞతలు తెలిపారు.
