AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదిలాబాద్ స్పెషల్.. గిరిజనుల స్టైల్‌ల్లో గుడ్డు చికెన్ కర్రీ.. ఎలా వండాలంటే?

ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన స్పెషల్ ఆహారపదార్థాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఆదిలాబాద్ స్పెషల్, గిరిజన స్టైల్‌లో మట్టి కుండలో గుడ్డు చికెన్ కర్రీ ఎలా వండాలి. దీని గురించి తెలుసుకుందాం. ఇది కట్టెల పొయ్యి మీద వండితే చాలా రుచికరంగా ఉంటుందంట.

Samatha J
|

Updated on: Jul 25, 2026 | 5:57 PM

Share
కావాల్సిన పదార్థాలు :  చికెన్ అరకేజీ, గుడ్లు నాలుగు ఉడికించినవి, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర మసాలా కోసం : ధనియాల పొడి, జీలకర్ర, ఎండు మిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, నూనె, ఉప్పు, పసుపు, కారం.

1 / 5
మసాలా తయారీ విధానం : ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. అందులో యాలకులు, ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి , గసగసాలు,దాల్చిన చెక్క , లవంగాలు, యాలకులు, వీటన్నింటిని మంచిగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఘరం మసాలా రెడీ అయినట్లే.

2 / 5
కర్రీ ప్రిపేర్ చేసుకోవడం : ముందుగా ఒక కుండ తీసుకోవాలి. అందులో నూనె వేసి వేడి అయ్యేలా చూసుకోవాలి.  తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి, అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, చికెన్, మసాలా పొడి, కారం వేసి ఒకప్పు నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.

3 / 5
ఇక ముందుగానే కోడి గుడ్లు తీసుకొని ఉడికించుకోవాలి. తర్వాత అందులో గుడ్లను ఫోర్క్‌తో చిన్న చిన్న గాట్లు పెట్టి కర్రీలో వేయాలి. తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచాలి. దీని వలన గుడ్లు మసాలాను పీల్చుకుంటాయి. చివరిలో కొత్తిమీర వేసి మంచిగా చల్లుకోవాలి.అంతే ఇవన్నీ వేసి వండుతుంటే కర్రీ చాలా రుచికరంగా ఉంటుందంట.

4 / 5
గిరిజనులు ఎప్పుడూ కూడా ప్యాకెట్ మసాలా వాడరు. అంతే కాకుండా ఎండు మిర్చి కారం పొడి మాత్రమే ఎక్కువగా వేస్తుంటారు. కోడి గుడ్లు కూడా ఉడకబెట్టి గాట్లు పెట్టి వేయడం వలన చికెన్ కర్రీ రుచికరంగా చాలా అద్భుతంగా ఉంటుంది.

5 / 5
Follow Us