AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: రోజూ మాయమవుతున్న గుడ్లు.. కోళ్ల గూడు తెరిచి చూస్తే గుండెలు అదిరే సీన్.. వీడియో చూస్తే..

రోజు రోజుకీ గూట్లో గుడ్లు మాయమవుతున్నాయి. సొంత కోళ్లే తమ గుడ్లను తినేస్తున్నాయని ఆ యజమాని అనుకున్నాడు.. కానీ ఒకరోజు డౌట్ వచ్చి గూటి డోర్ తెరిచి చూ దిమ్మతిరిగే సీన్ కనిపించింది. లోపల ఉన్నవాటిని చూసి ఆయన గుండెలు అదిరిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Video: రోజూ మాయమవుతున్న గుడ్లు.. కోళ్ల గూడు తెరిచి చూస్తే గుండెలు అదిరే సీన్.. వీడియో చూస్తే..
Snakes In Chicken Coop
Krishna S
|

Updated on: Jul 25, 2026 | 5:19 PM

Share

ఇంట్లో కోళ్లను పెంచుకునే వారికి గుడ్లు మాయమవ్వడం ఒక పెద్ద విచిత్రమైన సమస్య. కోళ్లు పెంచుకునే ఓ వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. కొన్ని రోజులుగా గూటిలోని గుడ్లు కనిపించకపోవడంతో.. తన కోళ్లే వాటిని తినేస్తున్నాయని అతడు భావించాడు. కానీ డౌట్ వచ్చి ఒకరోజు నెస్టింగ్ బాక్స్‌ను తెరిచి చూడగా, లోపల ఉన్న దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అయ్యింది. ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా ఐదు పాములు గుడ్ల పెట్టెల మధ్య హాయిగా చుట్టలు చుట్టుకుని పడుకుని ఉన్నాయి. తనకు ఎదురైన ఈ షాకింగ్ అనుభవాన్ని ఆయన సోషల్ మీడిలో షేర్ చేశారు. ‘‘పాములను తరిమికొట్టే పౌడర్ చల్లితే రెండు వారాలు పనిచేసింది. కానీ మళ్లీ స్నేక్స్ వచ్చేశాయి. వీటిని ఎలా వదిలించుకోవాలి?’’ అని నెటిజన్లను ఆయన సలహా కోరారు. దీనిపై స్పందించిన కొందరు వినూత్న సూచనలు చేశారు. కొబ్బరి లేదా వెనిల్లా సువాసన ఇచ్చే ఎయిర్ ఫ్రెష్నర్లను గూటిలో వేలాడదీయడం, పాములను పట్టుకుని దూరంగా వదిలేయడం, పెంపుడు పిల్లులు, కుక్కలను కాపలా ఉంచడం, నెస్టింగ్ బాక్స్‌లను కాస్త ఎత్తులో ఏర్పాటు చేయడం వంటి పరిష్కారాలు సూచించారు.

కోళ్ల గూళ్ల వైపే పాములు ఎందుకు వస్తాయి?

కోళ్ల గూళ్లు పాములకు సిద్ధం చేసిన ఆ విందు వేదికల్లా కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణాలు.. వేడిగా ఉండే నెస్టింగ్ బాక్స్‌లు, అక్కడ లభించే తాజా గుడ్లు పాములకు సులువైన ఆహారం. కోళ్ల దాణా కింద పడటం వల్ల ఎలుకలు చేరతాయి. ఆ ఎలుకల వేట కోసం పాములు అక్కడికి వస్తాయి. అయితే వన్యప్రాణి నిపుణుల ప్రకారం… ఈ పాములు విషపూరితమైనవి కావు. ఇవి మనుషులను చూసి భయపడతాయి. పైగా ఇవి ఎలుకలను వేటాడి చంపడం ద్వారా వ్యర్థాలు, రోగాలు వ్యాపించకుండా ప్రకృతి సమతుల్యతను కాపాడుతాయి. కాబట్టి వీటిని చంపడం కంటే గూట్లోకి రాకుండా నిరోధించడమే ఉత్తమం.

వీడియో చూడండి..

పాముల ముప్పు నుంచి గుడ్లను కాపాడుకోవడానికి శాశ్వత పరిష్కారాలు..

గుడ్లను త్వరగా సేకరించడం: కోడి పెట్టగానే గుడ్లను వెంటనే తీసేయడం వల్ల పాములకు ఆహారం దొరకదు.

ఎలుకలను అరికట్టడం: కోళ్ల దాణాను గాలిచొరబడని డబ్బాల్లో భద్రపరచాలి. కిందపడిన దాణాను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే ఎలుకలు, వాటి వెనుకే వచ్చే పాములు రావు.

రంధ్రాలను మూసివేయడం: కోళ్ల గూటి గోడలు, నేలపై ఉన్న చిన్న చిన్న హోల్స్‌ను మూసివేయాలి.

ఎత్తు పెంచడం: నెస్టింగ్ బాక్స్‌లను నేలమట్టానికి కాకుండా కాస్త ఎత్తులో ఏర్పాటు చేయాలి. పరిసరాల్లో పొదలు, చెత్త లేకుండా చూసుకోవాలి.

పాములు సాధారణంగా పెద్ద కోళ్లను తినవు కానీ.. గుడ్లు, చిన్న కోడిపిల్లలను మింగేస్తాయి. అందుకే రసాయనాలు వాడేకంటే, కోళ్ల గూడు నిర్మాణంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా పాముల ముప్పును సమర్థవంతంగా అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us