Vaibhav Sooryavanshi: వైభవ్‌ను వెక్కిరించిన సైమ్ అయూబ్.. మొత్తానికి మొట్టికాయలు పడ్డాయిగా
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన తర్వాత సైమ్ అయూబ్ చేసిన సెలబ్రేషన్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అభిషేక్ శర్మ బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. పాకిస్థాన్‌పై ఏషియన్ గేమ్స్ ఫైనల్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన, సైమ్ అయూబ్ వివాదాస్పద సెలబ్రేషన్, అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్ గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Vaibhav Sooryavanshi: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఏషియన్ గేమ్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కీలక పోరులో టీమిండియా అద్భుత విజయం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ యువ ఆటగాడు సైమ్ అయూబ్ ప్రవర్తించిన తీరు మాత్రం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన తర్వాత సైమ్ అయూబ్ చిన్నపిల్లలను జోకొట్టేలా వెకిలి చేష్టలతో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కావడంతో అభిమానులు అతడిని దారుణంగా ట్రోల్ చేశారు.
సొంత దేశం నుంచే తీవ్ర వ్యతిరేకత
మైదానంలో సైమ్ అయూబ్ చేసిన ఈ చేష్టలపై కేవలం భారతీయ అభిమానులే కాకుండా స్వయంగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓ ప్రముఖ యూట్యూబ్ షోలో ఈ అంశంపై స్పందించిన పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సైమ్ అయూబ్‌ను గట్టిగా తప్పుబట్టారు. కేవలం సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం కోసం, రీల్స్ కోసం ఇలాంటి పనులు చేయడం సిగ్గుచేటని ఆయన హితవు పలికారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక బాధ్యత ఉంటుందని, వైభవ్ సూర్యవంశీ వయసు చిన్నదైనా సరే సైమ్ అయూబ్ మాత్రం ఎలాంటి చిన్న పిల్లాడు కాదని కమ్రాన్ అక్మల్ చురకలంటించారు. ఆటగాళ్లు ఇలాంటి పనులు మానుకుని తమ ప్రదర్శనపై దృష్టి పెట్టాలని సూచించారు.
INSTANT KARMA HAS ENTERED THE CHAT!
Saim Ayub got 15-year-old Vaibhav Sooryavanshi out…
Then came the celebration.
He made a “baby in the cradle” gesture, appearing to mock the teenage Indian opener after taking his wicket.
But cricket had a response ready.
The next over. The very same bowler. ABHISHEK SHARMA. Four. SIX. And suddenly, the celebration looked very different. Abhishek didn’t need words.
He answered with the bat. And then came another twist—Pakistan’s fielding began to crack, with Saim Ayub putting down chances as India kept getting lifelines. From mocking the 15-year-old…
to watching India fight back.
THIS IS WHY CRICKET CALLS IT INSTANT KARMA.
India 🇮🇳 vs Pakistan 🇵🇰 Asian Games Gold Medal Final 🥇
Every ball. Every gesture. Every response. This final has EVERYTHING. 🔥
#InstantKarma #INDvPAK #AsianGames2026 #SaimAyub #VaibhavSuryavanshi #AbhishekSharma #TeamIndia #Cricket #GoldMedalMatch
— Anil Bansal (@dilseanilbansal) October 3, 2026
బ్యాట్‌తో సమాధానం ఇచ్చిన అభిషేక్ శర్మ
పాక్ ఆటగాడు సైమ్ అయూబ్ చేసిన ఈ అవమానకరమైన సెలబ్రేషన్‌ను నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో నిలబడి ఉన్న మరో భారతీయ యువ ఆటగాడు అభిషేక్ శర్మ దగ్గరుండి గమనించాడు. అప్పుడు మైదానంలో ఎలాంటి వాగ్వాదానికి దిగని అభిషేక్, సరిగ్గా తర్వాతి ఓవర్లలో తన బ్యాట్‌తోనే ప్రత్యర్థికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. సైమ్ అయూబ్ బౌలింగ్‌లో కేవలం 20 బంతుల్లోనే మెరుపు వేగంతో హఫ్ సెంచరీ బాదిన అభిషేక్ శర్మ 7 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. సెంటిమెంట్లు, వెకిలి చేష్టలు పక్కన పెట్టి భారత బ్యాటర్లు ప్రదర్శించిన ఈ ఆధిపత్యం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
