AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upadi Hami Scheme :గ్రామీణులకు సూపర్ న్యూస్.. కొత్త జాబ్ కార్డుల జారీకి లైన్ క్లియర్.. ఇలా దరఖాస్తు చేస్కోండి..

గ్రామీణులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకం కింద కొత్త జాబ్ కార్డుల జారీకి ఆమోదం తెలిపింది. కరువు పరిస్థితుల క్రమంలో కొత్త జాబ్ కార్డుల విడుదలకు సిద్దమైంది. వీటిని ఎలా పొందాలనేది ఇప్పుడు చూద్దాం.

Upadi Hami Scheme :గ్రామీణులకు సూపర్ న్యూస్.. కొత్త జాబ్ కార్డుల జారీకి లైన్ క్లియర్.. ఇలా దరఖాస్తు చేస్కోండి..
Upadi Hami Scheme
Venkatrao Lella
|

Updated on: Oct 04, 2026 | 3:40 PM

Share

తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వీబీ జీరాంజీ పథకం కింద కొత్తగా జాబ్ కార్డులు మంజూరు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎల్‌నివో పరిస్థితుల క్రమంలో కొత్త జాబ్ కార్డులు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎల్‌నివో ప్రభావంతో గతంతో పోలిస్తే సాధారణ వర్షపాతం భారీగా పడిపోయింది. దీని వల్ల రైతులు పంట సాగుకు దూరం కావడంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని 18 జిల్లాల్లోని 265 మండలాల్లో కరువు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఎల్‌నివో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట సాగు తగ్గిపోవడం, కూలీలకు పని లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అలాంటివారికి ఉపయోగపడేందుకు కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకున్నవారికి 15 రోజుల్లో జాబ్ కార్డు అందించేలా ప్రణాళికలు రచించింది. దీని వల్ల వారికి వెంటనే ఉపాధి లభించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 52.46 కుటుంబాల్లోని 1.08 కోట్ల మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. కరువు పరిస్థితుల క్రమంలో కొత్తగా ఉపాధి పొందాలనుకునేవారికి జాబ్ కార్డులు జారీ చేయనున్నారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆదాయం లభించనుంది. ఉపాధి అవసరం ఉన్నవారిని గుర్తించి ఈ పథకంలో నమోదు చేయించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖలను ప్రభుత్వం ఆదేశించింది.

జాబ్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

ఈ పథకంలో చేరాలంటే 18 ఏళ్లు తప్పనిసరిగా నిండి ఉండాలి. దరఖాస్తు ఫారంను పూర్తి చేసి ఆధార్ కార్డ్ జిరాక్స్, ఫొటోను జత చేయాలి. ఆ తర్వాత దరఖాస్తును ఫారంను మీ గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమర్పించాల్సి ఉంటుంది. పంచాయతీ కార్యదర్శి పరిశీలన అనంతరం మీ దరఖాస్తును మండల కార్యాలయానికి పంపిస్తారు. ఎంపీడీవో దరఖాస్తును పరిశీలించి మీ అర్హతలను తనిఖీ చేస్తారు. అర్హతలు ఉంటే జాబ్ కార్డు జారీ చేస్తారు. అనంతరం మీకు ఈ జాబ్ కార్డును అందిస్తారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా జాబ్ కార్డు అందించాలని ప్రభుత్వం నిబంధనలు విధిస్తోంది.

ప్రతి గ్రామం నుంచి రోజుకు 100 నుంచి 150 మందికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్‌ శాఖ నిర్ణయించింది. దీని వల్ల గ్రామీణులకు ఉపాధి లభిస్తుందని తెలిపింది. అయితే కేంద్రం వీబీ జీరాంజీ పథకంలో అనేక మార్పులు చేసింది. పనిదినాలతో పాటు కనీస వేతనాన్ని కూడా పెంచింది. వారం రోజుల్లో డబ్బులు క్రెడిట్ చేసేలా కొత్త మార్గదర్శకాలు రూపొందింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం ఈ స్కీమ్ అమలు చేస్తోంది.

Follow Us