లక్కీ బ్యూటీ.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. ఒకేసారి మూడు ఓటీటీల్లో టాప్‌లో ఆమె సినిమాలే..!
ప్రస్తుతం మూడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మమితా బైజు సినిమాలు టాప్‌లో ట్రెండ్ అవుతుండటంతో.. రాబోయే రోజుల్లో ఈ మలయాళ బ్యూటీ సౌత్ ఇండియాలో మరింత బిజీ హీరోయిన్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటీటీలో ఈ ముద్దుగుమ్మ పేరు గట్టిగా వినిపిస్తుంది.

ప్రేమలు సినిమాతో ఒక్కసారిగా దక్షిణాది ప్రేక్షకులకు చేరువైన మలయాళ బ్యూటీ మమితా బైజు.. ప్రస్తుతం వరుస విజయాలతో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది. కేవలం థియేటర్లలోనే కాదు.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపైనా ఆమె నటించిన సినిమాలు దుమ్మురేపుతున్నాయి. తాజాగా ఒకేసారి మూడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మమితా బైజు నటించిన చిత్రాలు టాప్ ట్రెండింగ్‌లో నిలవడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మమితా బైజు నటించిన మూడు సినిమాలు ప్రస్తుతం వరుసగా నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ5లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకే సమయంలో వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఆమె సినిమాలు టాప్ లో ట్రెండ్ అవ్వడం చూస్తే ఆమె క్రేజ్ ఏంటో అర్ధమవుతుంది.
చిరంజీవి, వెంకటేష్‌లతో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? సోషల్ మీడియాను ఊపేస్తుందిగా..
ముందుగా.. సూర్య, మమితా బైజు జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన విశ్వనాథ్ అండ్ సన్స్ డిజిటల్‌గానూ మంచి స్పందన అందుకుంటోంది. థియేట్రికల్ రన్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాప్ ట్రెండింగ్ లిస్ట్ లో కొనసాగుతోంది. డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమా క్రేజ్ తగ్గకపోవడం ఆసక్తిని పెంచుతుంది. తాజాగా ఇండియా లెవెల్‌లో నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్ అందుకోవడంతో మమితా బైజు క్రేజ్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఎవర్రా నువ్వు..! బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని.. నెటిజన్స్ కామెంట్స్ మాత్రం నెక్స్ట్ లెవల్
మరోవైపు నివిన్ పౌలీ, మమితా బైజు కలిసి నటించిన బెత్లేహెం కుటుంబ యునిట్ కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై మంచి జోష్ చూపిస్తోంది. జియోహాట్‌స్టార్‌లోకి వచ్చిన వెంటనే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన ఈ చిత్రం ప్రస్తుతం ట్రెండింగ్‌లో టాప్ స్థానాల్లో నిలిచింది. కుటుంబ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మమితా బైజు మరోసారి తన నటనతో మెప్పించిందనే టాక్ వినిపిస్తోంది. దళపతి విజయ్ నటించిన జన నాయగన్ లో మమితా బైజు కీలక పాత్రలో కనిపించింది. థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజిటల్‌గానూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. జీ5లో తమిళ సినిమాల విభాగంలో జన నాయగన్ టాప్ ట్రెండింగ్ స్థానాన్ని దక్కించుకోవడం మరో ప్రత్యేకత. దీంతో మమితా బైజు నటించిన మూడు చిత్రాలు మూడు వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకేసారి హవా కొనసాగిస్తున్నాయి.
10th క్లాస్ మూడుసార్లు ఫెయిల్ అయ్యా.. ఖచ్చితంగా డైరెక్టర్ అవుతానంటున్న స్టార్ హీరో కూతురు
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




