Vaibhav Sooryavanshi: టైం వస్తే ప్రపంచాన్ని ఊపేస్తాడు.. బుడ్డోడి పై కెప్టెన్ ప్రశంసల వర్షం
Vaibhav Sooryavanshi: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. సరైన సమయం వచ్చినప్పుడు వైభవ్ భారత క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదుగుతాడని ధీమా వ్యక్తం చేశాడు. భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్‌కు ముందు శ్రేయస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. యువ ఆటగాడి ప్రతిభను ప్రత్యేకంగా కొనియాడాడు.

Vaibhav Sooryavanshi: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య త్వరలో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు భారత టీ-20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ జట్టు వ్యూహాలు అలాగే యువ ఆటగాళ్ల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా కేవలం 15 ఏళ్ల వయసులో జట్టులో స్థానం సంపాదించిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ గురించి శ్రేయస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మైదానంలో వైభవ్ ప్రదర్శించే దూకుడు అలాగే బయట ఉండే ప్రశాంత స్వభావం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు
వైభవ్ సూర్యవంశీ గురించి శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ అతనితో తాను ఎక్కువగా క్రికెట్ేతర విషయాల గురించే మాట్లాడతానని తెలిపారు. అందరూ కేవలం క్రికెట్ గురించే మాట్లాడతారని, కానీ అతని కుటుంబం, జీవనశైలి గురించి మాట్లాడినప్పుడు అతను ఎంతో ఉత్సాహంగా, సహజంగా ఉంటాడని చెప్పారు. మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉండే వైభవ్, బ్యాట్ పట్టుకుంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు భయంకరంగా మారుతాడని కొనియాడారు. ప్రస్తుతం జట్టులో వరల్డ్ కప్ గెలిచిన ఓపెనర్లు అద్భుతంగా రాణిస్తున్నారని, వారంతా ఆ స్థానంలో సమయం గడపడానికి అర్హులని స్పష్టం చేశారు. సరైన సమయం వచ్చినప్పుడు వైభవ్ భారత క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదుగుతాడని శ్రేయస్ ధీమా వ్యక్తం చేశారు.
ముందు సిరీస్ గెలవడమే ముఖ్యం
జట్టులో అనవసరమైన ప్రయోగాలు చేయడం గురించి శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ ముందుగా సిరీస్ గెలడమే తమ ప్రధాన లక్ష్యమని తేల్చిచెప్పారు. మొదటి నుంచే ప్రతి మ్యాచ్‌లోనూ ప్రయోగాలు చేసుకుంటూ పోతే ఆటగాళ్లలో అభద్రతాభావం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్లేయర్లు తమపై తాము అలాగే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న తోటి ఆటగాళ్లపై సందేహాలు వ్యక్తం చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పారు. తాను కూడా గతంలో అలాంటి అనుభవాలను ఎదుర్కొన్నానని, అందుకే ఆటగాళ్లకు పూర్తి భద్రత కల్పిస్తూ ముందుకెళ్లడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని శ్రేయస్ స్పష్టం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
