AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి.. పగిలిన కిటికీల అద్దాలు

అమెరికాలోని హిందూ దేవాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఒహాయో రాష్ట్రంలోని రిచ్‌మండ్ హైట్స్ లో ఉన్న శ్రీ స్వామినారాయణ్ వడ్తల్ ధామ్ ఆలయాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. ఆ సమయంలో ఆలయంలో పూజారులతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. ఆలయంపై ఇటుకలు విసరడంతో కిటికీలు, తలుపులు, అద్దాలు ధ్వంసమయ్యాయి.

అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి.. పగిలిన కిటికీల అద్దాలు
Hindu Temple Vandalised With Bricks In Us Devotees Were Present Inside
Sharada V
|

Updated on: Oct 04, 2026 | 1:50 PM

Share

ఘటనను ఉత్తర అమెరికా హిందువుల కూటమి(CoHNA), హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) తీవ్రంగా ఖండించాయి. ఒహయో మేయర్ కిమ్ థామస్, రిచ్‌మండ్ హైట్స్ నగర అధికారులు బహిరంగంగా స్పందించాలని.. నిందితుడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరాయి.

ఈ ఘటనపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) తీవ్రంగా స్పందించింది. అమెరికాలో హిందూ అమెరికన్ సమాజంపై గతంలో ఎన్నడూ లేనంతగా ద్వేషపూరిత ప్రచారం, వ్యాఖ్యలు పెరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. భారతీయులు, హిందూ అమెరికన్లపై విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రచారాన్ని రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంస్థలు బహిరంగంగా ఖండించాలని HAF కోరింది. ఇలాంటి ఘటనలపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. HAF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుహాగ్ శుక్లా దాడిని ఖండించారు. దేవాలయంలోని వీడియోలను పరిశీలించి నిందితుడిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని కోరారు. ఆన్‌లైన్‌ పోస్టుల ద్వారా జరిపిన విద్వేషపూరిత ప్రచారం కాకుండా ఇప్పుడు వాస్తవ రూపంలో హిందూ దేవాలయంపై దాడికి తెగబడ్డారని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎఫ్‌బీఐ సివిల్ రైట్స్ యూనిట్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు హిందూ అమెరికన్ ఫౌండేషన్ తెలిపింది. ఆలయ నిర్వాహకులతో తమ సంస్థ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, అవసరమైన న్యాయ సహాయం, ఇతర సహకారం అందిస్తున్నట్లు వెల్లడించింది. దాడిని విద్వేషపూరిత నేరం (హేట్ క్రైమ్) కోణంలో కూడా దర్యాప్తు చేయాలని కోరింది.

దసరా వేడుకలకు ముందు ఘటన

ఈ దాడి జరిగిన సమయంలో ఒహయోలోని భారతీయ-అమెరికన్ సమాజం హిందూ హెరిటేజ్ మంత్ వేడుకలకు సిద్ధమవుతోంది. మరో పది రోజుల్లో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికాలో హిందూ మతపరమైన ప్రదేశాలపై గతంలోనూ దాడులు, విధ్వంస ఘటనలు జరిగినట్లు HAF తెలిపింది. 2022 ఆగస్టులో న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ఉన్న శ్రీ తులసి మందిరంలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 2023 డిసెంబర్‌లో కాలిఫోర్నియాలోని నెవార్క్‌లో ఉన్న SMVS శ్రీ స్వామినారాయణ ఆలయ గోడలపై అభ్యంతరకరమైన రాతలు రాశారు. 2024లో న్యూయార్క్, కాలిఫోర్నియాలోని BAPS ఆలయాలపై కూడా దాడులు జరిగినట్లు HAF పేర్కొంది. గత ఏడాది కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లో ఉన్న BAPS ఆలయంపై ద్వేషపూరిత సందేశాలు రాసి దానిని అపవిత్రం చేసిన ఘటన కూడా నమోదైందని తెలిపింది.

Follow Us
రాజమండ్రి పోలీసులకు CPR శిక్షణ.. గుండె ఆగినవారికి ప్రాణం పోసేలా..
రాజమండ్రి పోలీసులకు CPR శిక్షణ.. గుండె ఆగినవారికి ప్రాణం పోసేలా..
రూథర్‌ఫోర్డ్ ఔట్‌పై రచ్చ.. అంపైర్లతో విండీస్ బ్యాటర్ వాగ్వాదం
రూథర్‌ఫోర్డ్ ఔట్‌పై రచ్చ.. అంపైర్లతో విండీస్ బ్యాటర్ వాగ్వాదం
అద్దిరిపోయిన శర్వానంద్ 'భోగి' టీజర్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
అద్దిరిపోయిన శర్వానంద్ 'భోగి' టీజర్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి.. పగిలిన కిటికీల అద్దాలు
అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి.. పగిలిన కిటికీల అద్దాలు
ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న సినిమా..
ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న సినిమా..
ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్ నేతల నజర్.. రేసులో ఉన్నది వీరేనా..?
ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్ నేతల నజర్.. రేసులో ఉన్నది వీరేనా..?
బాబా వంగా జ్యోతిష్యం.. 2027లో తలరాత మారిపోయే రాశులివే!
బాబా వంగా జ్యోతిష్యం.. 2027లో తలరాత మారిపోయే రాశులివే!
రోహిత్, కోహ్లీ ఇన్.. వరల్డ్ కప్ 2027కు టీమిండియా స్వ్కాడ్ ఫిక్స్?
రోహిత్, కోహ్లీ ఇన్.. వరల్డ్ కప్ 2027కు టీమిండియా స్వ్కాడ్ ఫిక్స్?
పవన్ కల్యాణ్, సింగీతంల జీసస్ క్రైస్ట్ బయోపిక్ ఎందుకు ఆగిపోయింది?
పవన్ కల్యాణ్, సింగీతంల జీసస్ క్రైస్ట్ బయోపిక్ ఎందుకు ఆగిపోయింది?
క్రిస్ గేల్ ప్రపంచ రికార్డ్‌నే బద్దలు కొట్టిన 20 ఏళ్ల ప్లేయర్..!
క్రిస్ గేల్ ప్రపంచ రికార్డ్‌నే బద్దలు కొట్టిన 20 ఏళ్ల ప్లేయర్..!