AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర రోడ్డు ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు దుర్మరణం

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో శనివారం (జూలై 25) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖుజ్నేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భిల్ఖేడి జంక్షన్ వద్ద అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు దుర్మరణం
Car Plunges Into Pond
Balaraju Goud
|

Updated on: Jul 25, 2026 | 5:39 PM

Share

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో శనివారం (జూలై 25) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖుజ్నేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భిల్ఖేడి జంక్షన్ వద్ద అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం, MP-09-CC-6414 నంబర్ గల కారు ప్రమాదవశాత్తు రహదారి నుంచి జారి నేరుగా చెరువులో పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో నీటిలోనే చిక్కుకుపోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఖుజ్నేర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి రవి ఠాకూర్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

గ్రామస్థుల సహాయంతో ఎంతో శ్రమించి కారును చెరువులో నుంచి బయటకు తీశారు. అనంతరం కారులో చిక్కుకున్న వారిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి ఐదుగురు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ప్రాథమిక విచారణలో ప్రమాదం జరిగిన సమయంలో కారు తలుపులు, కిటికీలు పూర్తిగా మూసి ఉండటంతో లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. వారిని రక్షించేందుకు కిటికీలను పగులగొట్టినప్పటికీ అప్పటికే ఆలస్యమైందని వెల్లడించారు.

మృతుల జేబుల్లో లభించిన పత్రాల ఆధారంగా వారి వివరాలను గుర్తించే ప్రయత్నం కొనసాగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం వారు అర్నియా ఖుర్ద్, అవంతిపూర్ బరోడియా, మోహన్ బరోడియా, హతాయ్ ఖేడా గ్రామాలకు చెందిన వారిగా భావిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు వచ్చి గుర్తింపు నిర్ధారించిన తర్వాతే అధికారిక ప్రకటన చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమా, లేక వాహనంలో సాంకేతిక లోపం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషాద ఘటనతో రాజ్‌గఢ్ జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి!
చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి!
టీమిండియా మాజీ క్రికెటర్‌పై చీటింగ్ కేసు నమోదు..!
టీమిండియా మాజీ క్రికెటర్‌పై చీటింగ్ కేసు నమోదు..!
యూరిన్ సరిగా రాని వాళ్ళు.. ప్రకృతి ప్రసాదం రోజూ రెండు గిన్నెలు
యూరిన్ సరిగా రాని వాళ్ళు.. ప్రకృతి ప్రసాదం రోజూ రెండు గిన్నెలు
బుధుడి కటాక్షం.. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి..
బుధుడి కటాక్షం.. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి..
రోజూ మాయమవుతున్న గుడ్లు.. కోళ్ల గూడు తెరిచి చూస్తే గుండెలు..
రోజూ మాయమవుతున్న గుడ్లు.. కోళ్ల గూడు తెరిచి చూస్తే గుండెలు..
తొలి ఏకాదశి స్పెషల్.. రావి ఆకుపై మహావిష్ణువు రూపం..
తొలి ఏకాదశి స్పెషల్.. రావి ఆకుపై మహావిష్ణువు రూపం..
నిమ్స్‌లో మరో చారిత్రక ఘట్టం..కేవలం 2 గంటల్లోనే బ్రెయిన్ సర్జరీలు
నిమ్స్‌లో మరో చారిత్రక ఘట్టం..కేవలం 2 గంటల్లోనే బ్రెయిన్ సర్జరీలు
వర్షాకాలంలో ఏసీని ఈ మోడ్‌లో అస్సలు నడపకండి.. ఎందుకో తెలుసా?
వర్షాకాలంలో ఏసీని ఈ మోడ్‌లో అస్సలు నడపకండి.. ఎందుకో తెలుసా?
పిల్లిని కూడా వదల్లేదు.. షాకింగ్ ప్లాన్ బట్టబయలు!
పిల్లిని కూడా వదల్లేదు.. షాకింగ్ ప్లాన్ బట్టబయలు!
పేదవాడిని రాజుగా, రాజును పేదవాడిగా మార్చగలిగే గ్రహాలు ఇవే..!
పేదవాడిని రాజుగా, రాజును పేదవాడిగా మార్చగలిగే గ్రహాలు ఇవే..!