మెగాస్టార్ చిరంజీవి మొదటి లవ్ స్టోరీ.. అసలు ఏం జరిగిందంటే?

24-07-2026

Pic credit - Instagram

Phani Ch

తెలుగు చిత్రసీమలో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి సినీ ప్రయాణం ఎంత అద్భుతమో, ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు కూడా అంతే ఆసక్తికరంగా ఉంటాయి.

ముఖ్యంగా ఆయన ఏడో తరగతి చదువుతున్న సమయంలో జరిగిన మొదటి లవ్ స్టోరీ విశేషాలు ఇప్పుడు చూద్దాం!

ఆమిర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' సినిమా ప్రమోషన్స్ సమయంలో చిరంజీవి తన ఫస్ట్ లవ్ సీక్రెట్ బయటపెట్టారు.

ఏడో తరగతిలో ఉన్నప్పుడు తాను ఫస్ట్ టైమ్ ప్రేమలో పడ్డానని, ''ఒక అమ్మాయి సైకిల్ తొక్కడం అనేది ఆ రోజుల్లో మొగల్తూరులో చాలా ఆశ్చర్యంగా ఉండేదని చెప్పారు.

ఆ అమ్మాయి సైకిల్ తొక్కుతుంటే ఎలా తొక్కుతుందో అని ఆసక్తిగా వెనక్కి తిరిగి చూసేవాడినని, అది గమనించి తను 'ముందు చూడు' అని తన ముఖాన్ని ముందుకు తిప్పేదని చెప్పారు.

చిన్నప్పుడు సరదాగా జరిగిన ఈ సంఘటనను చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో పంచుకుని నవ్వుకున్నారు. అమాయకత్వంతో నిండిన ఆ స్కూల్ డేస్ జ్ఞాపకాలు ఇప్పటికీ తనకు ఎంతో ప్రత్యేకమని చెబుతుంటారు.

ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన మెగాస్టార్ జీవితంలో ఇలాంటి చిన్ననాటి ముచ్చట్లు వినడానికి ఎంతో ముచ్చటగా ఉంటాయి.