June 10, 2026
Subhash
బరువు తగ్గాలన్నా, ఫిట్‌గా ఉండాలన్నా నడక ఎంతో ముఖ్యం. అయితే 1 కిలోమీటర్ దూరం పూర్తి కావడానికి మనం ఎన్ని అడుగులు వేయాలో ఇప్పుడు చూద్దాం.
ఒక సాధారణ వ్యక్తి మోడరేట్ (సాధారణ) వేగంతో నడిస్తే, ఒక కిలోమీటర్ పూర్తి కావడానికి సుమారు 1,250 నుండి 1,550 అడుగులు పడతాయి. సగటున దీనిని 1,300 - 1,400 అడుగులుగా చెప్తారు.
ఎక్కువ ఎత్తు ఉన్నవారి కాళ్లు పొడవుగా ఉండటంతో అడుగు పెద్దదిగా పడుతుంది. వారు తక్కువ అడుగులతోనే కిలోమీటర్ పూర్తి చేస్తారు. పొట్టిగా ఉంటే ఎక్కువ అడుగులు పడతాయి.
ఎత్తుల తేడా కారణంగా సగటున ఒక పురుషుడు 1 కిలోమీటర్ నడవడానికి 1,300 నుండి 1,400 అడుగులు వేస్తే, ఒక మహిళకు 1,400 నుండి 1,500 అడుగులు అవసరమవుతాయి.
సాధారణంగా నడిస్తే ఎక్కువ అడుగులు పడతాయి. బ్రిస్క్ వాకింగ్ చేస్తే అడుగుల సంఖ్య 1,200 నుండి 1,350కి తగ్గుతుంది. రన్నింగ్‌తో 1,000 నుండి 1,200 అడుగుల్లోనే కిలోమీటర్ పూర్తవుతుంది.
ఒక వ్యక్తి సాధారణ వేగంతో నడిస్తే 1 కిలోమీటర్ పూర్తి చేయడానికి 12 నుండి 15 నిమిషాల సమయం పడుతుంది. అదే వేగంగా నడిస్తే 10 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం రోజుకు 10 వేల అడుగులు నడవడం మంచిది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మీరు రోజుకు సుమారు 7 నుండి 7.5 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది.
అడుగుల సంఖ్య మనుషులను బట్టి మారినా, రోజుకు కనీసం 30 నిమిషాలు లేదా 4-5 కిలోమీటర్లు నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు అదుపులో ఉంటుంది.