నాలుగు వారాలుగా తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల ప్రజలను భయపెడుతున్న పులిని పట్టుకునేందుకు అటవీశాఖ ముమ్మరంగా గాలిస్తోంది. ప్రస్తుతం శంఖవరం మండలం, మాసంపల్లి వద్ద సంచరిస్తున్న పులి కదలికలను డ్రోన్లు, థర్మల్ డ్రోన్లతో నిఘా పెట్టి, 11 హనుమాన్, మూడు ట్రాంక్విలైజింగ్ బృందాలతో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.