Monkeypox: దేశంలో 9కి చేరిన మంకీపాక్స్‌ కేసులు.. దేశంలో తొలిసారిగా మహిళకు వైరస్‌ నిర్ధారణ..!

Monkeypox: దేశంలో మంకీపాక్స్‌ కేసులు పెరిగిపోతున్నాయి. గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనకు గురి చేస్తే ఇప్పుడు మంకీపాక్స్‌ కేసులతో ఆందోళనకు గురవుతున్నారు..

Monkeypox: దేశంలో 9కి చేరిన మంకీపాక్స్‌ కేసులు.. దేశంలో తొలిసారిగా మహిళకు వైరస్‌ నిర్ధారణ..!
Monkeypox
Follow us
Subhash Goud

|

Updated on: Aug 04, 2022 | 6:19 AM

Monkeypox: దేశంలో మంకీపాక్స్‌ కేసులు పెరిగిపోతున్నాయి. గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనకు గురి చేస్తే ఇప్పుడు మంకీపాక్స్‌ కేసులతో ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ఢిల్లీలో 31 ఏళ్ల మహిళకు మంకీపాక్స్ సోకింది. అదే సమయంలో ఇప్పుడు దేశంలో మంకీపాక్స్‌ కేసుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఢిల్లీలో ఇప్పటి వరకు మంకీపాక్స్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇద్దరు రోగులు లోక్‌నాయక్‌ జైప్రకాష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దేశంలోనే తొలిసారిగా ఓ మహిళకు మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలింది. మహిళ నైజీరియాకు చెందినదిగా గుర్తించారు అధికారులు. కానీ ప్రస్తుతం ఆమె పశ్చిమ ఢిల్లీలో నివసిస్తున్నారు. మహిళను డీడీయూ ఆస్పత్రి నుంచి లోక్‌నాయక్ ఆస్పత్రికి ఒకరోజు ముందే రిఫర్ చేశారు.

మంకీపాక్స్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే ఆసుపత్రులు, ఐసోలేషన్ గదుల సంఖ్యను మరింత పెంచుతామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఈ ఆసుపత్రులన్నింటిలో మంకీపాక్స్ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి WHO నిర్దేశించిన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా, ఢిల్లీ ప్రభుత్వం మరింత అప్రమత్తం అవుతోంది. దీని కోసం ఢిల్లీ ప్రభుత్వం లోక్‌నాయక్ జైప్రకాష్ హాస్పిటల్‌లో 20 ఐసోలేషన్ రూమ్‌లు, గురుతేగ్ బహదూర్ హాస్పిటల్‌లో 10 ఐసోలేషన్ రూమ్‌లు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హాస్పిటల్‌లో 10 ఐసోలేషన్ రూమ్‌లను రిజర్వ్ చేసింది. ఇవి మాత్రమే కాకుండా కైలాష్ దీపక్ హాస్పిటల్, MD సిటీ హాస్పిటల్, బాత్రా హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ తుగ్లకాబాద్‌తో సహా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు మూడు ప్రైవేట్ ఆసుపత్రులలో 10 ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేసినట్లు అధికారుల ద్వారా సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా 16 వేలకు పైగా కేసులు:

ఇవి కూడా చదవండి

జూలై 23 వరకు ప్రపంచవ్యాప్తంగా 75 దేశాలలో 16 వేలకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంకీపాక్స్‌ను డబ్ల్యూహెచ్‌వో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. భారతదేశంలో ఇప్పటి వరకు తొమ్మిది మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. వాటిలో నాలుగు ఢిల్లీకి చెందినవి ఉన్నాయి.

మంకీపాక్స్‌ లక్షణాలు:

దేశంలో మంకీపాక్స్‌ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. గత 21 రోజులలో మంకీపాక్స్‌ వ్యాధి సోకినా, దేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన ఏ వయస్సు వ్యక్తి అయినా శరీరంపై దద్దుర్లు, జ్వరం, తలనొప్పి, బలహీనత వంటి లక్షణాలు ఉంటే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. అలాంటి సమయంలో సదరు మంకీపాక్స్‌ వ్యాధి సోకినట్లుగా అనుమానించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఈ వైరస్‌ సోకిన వ్యక్తి ఉపయోగించే బట్టలు, పరుపులు, ఇతర తినే పాత్రలు ఇతరులు ఉపయోగించవద్దని, లేకపోతే వారికి కూడా సోకే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి