AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: సూర్య ‘గజిని’ క్లైమాక్స్‌లో కనిపించే ఈ పాప గుర్తుందా? ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవరంటే?

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతుంటాయి. ముఖ్యంగా సినిమా తారలకు సంబంధించిన ఫొటోలు అయితే తరచూ ట్రెండింగ్ లో ఉంటాయి. అలా ఇప్పుడు సూర్య నటించిన గజినీ సినిమాలో నటించిన పాప ఫొటో ఇప్పుడు నెట్టంట తెగ చక్కర్లు కొడుతోంది.

Suriya: సూర్య 'గజిని' క్లైమాక్స్‌లో కనిపించే ఈ పాప గుర్తుందా? ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవరంటే?
Suriya Movie
Basha Shek
|

Updated on: Mar 17, 2026 | 3:58 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరోకు మంచి క్రేజ్ తీసుకొచ్చిన చిత్రం గజిని. 2005లో రిలీజైన ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లు సాధించింది. ఏ.ఆర్. మురగదాస్ తెరకెక్కించిన గజిని సినిమాలో సూర్య సరసన ఆసిన్ హీరోయిన్ గా నటించింది. లేడీ సూపర్ స్టార్ నయనతార మరో కీలక పాత్రలో మెరిసింది. అలాగే ప్రదీప్ రావత్, మనోబాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక హరీస్ జయరాజ్ అందించిన పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ఇదిలా ఉంటే గజిని సినిమా క్లైమాక్స్ ఓ మనకు ఓ స్కూల్ పాప కనిపిస్తుంది. సూర్య కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతుండగా ఒక పాప క్యూట్ స్మైల్ ఇస్తూ హీరోను చూస్తుంద. సూర్య కూడా కారు ఆపేసి ఆ చిన్నారిని చూసి ఒక స్మైల్ ఇస్తాడు. ఇప్పుడు ఆ పాప ఫొటో నెట్టింట వైరలవుతోంది. అసలు విషయంలోకి వెళితే.. సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. సోమవారం (మార్చి 16) ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

ఇదిలా ఉంటే‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాపై సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్‌ చర్చ నడుస్తోంది. అదేంటంటే.. ‘గజిని’ సినిమా క్లైమాక్స్‌లో కనిపించిన ఆ చిన్నారే ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో హీరోయిన్‌గా నటిస్తున్న మమితా బైజు అంటూ ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఎంతమాత్రం నిజం ఉంది అనేది మాత్రం తెలియ‌దు కానీ ఇప్పుడు గజినీ పాప ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ క్రేజీ రూమర్స్ పుట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. . ‘గజిని’ సినిమాలో సూర్య పేరు సంజయ్ రామస్వామి. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో సూర్య పాత్ర పేరు ‘సంజయ్ విశ్వనాథ్’ . ఇలా పేర్లు దగ్గరగా ఉండడంతో నెటిజన్లు ఈ రెండు సినిమాలను ముడిపెడుతూ పోస్టులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరలవుతోన్న ఫొటో..

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలో సూర్య 40 ఏళ్ల వయసున్న ప్రొఫెషనల్ షూటర్‌గా నటిస్తున్నాడు. అలాగే ‘ప్రేమలు’ సినిమాతో తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ మమితా బైజు ఇందులో 20 ఏళ్ల అమ్మాయిగా నటిస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం చుట్టూ సాగే ఎమోషనల్ డ్రామానే ఈ చిత్ర కథాంశమని తెలుస్తోంది. సీనియర్ హీరోయిన్లు రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమా 2026 జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ టీజర్..

Follow Us
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ
బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?
బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?
ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..
ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే