AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ డేంజరస్ ఓపెనర్లు.. వీళ్ల ముందు కోహ్లీ, గేల్ పిల్ల బచ్చాలే..’

Dangerous Opening Pair IPL 2026: మరో కొన్ని రోజుల్లో ఐపీఎల్ 2026 సందడి మొదలుకానుంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటింగ్ విధ్వంసంపై టీమ్ ఇండియా సీనియర్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ జోడి ఐపీఎల్ చరిత్రలోనే గేల్ - కోహ్లీ కంటే ప్రమాదకరమని పుజారా తెలిపాడు.

'ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ డేంజరస్ ఓపెనర్లు.. వీళ్ల ముందు కోహ్లీ, గేల్ పిల్ల బచ్చాలే..'
Dangerous Opening Pair Ipl 2026
Venkata Chari
|

Updated on: Mar 17, 2026 | 4:02 PM

Share

Dangerous Opening Pair IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల గురించి చతేశ్వర్ పుజారా మాట్లాడుతూ.. గత రెండు సీజన్లుగా వీరు అత్యంత విధ్వంసకర ఓపెనర్లుగా ఎదిగారని కొనియాడాడు. మొదటి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే వీరి శైలి వల్లే హైదరాబాద్ జట్టు సునాయాసంగా 250 పైచిలుకు స్కోర్లను నమోదు చేస్తోందని ఆయన విశ్లేషించాడు.

కోహ్లీ – గేల్ జోడిని మించిపోయారుగా..?

ఐపీఎల్ చరిత్రలో దూకుడైన ఓపెనింగ్ జోడి అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ. కానీ పుజారా మాత్రం అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జోడి వారికన్నా చాలా ప్రమాదకరమని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏ బౌలర్ కూడా వీరికి బౌలింగ్ చేయాలని కోరుకోడని, ఆ స్థాయి భయాన్ని వీరు ప్రత్యర్థుల్లో క్రియేట్ చేస్తున్నారని పేర్కొన్నాడు. అయితే, సన్‌రైజర్స్ జట్టు కేవలం తమ సొంత మైదానమైన ఉప్పల్‌లో మాత్రమే భారీ స్కోర్లు చేస్తోందని, ఇతర పిచ్‌లపై కూడా ఇదే జోరు కొనసాగించాల్సి ఉంటుందని గుర్తుచేశారు.

ప్రత్యర్థుల వ్యూహాలు – SRH వీక్ నెస్..

సన్‌రైజర్స్ బ్యాటింగ్ లో హెడ్, అభిషేక్ తో పాటు హెన్రీచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ వంటి కీలక ఆటగాళ్ళు ఉన్నారు. వీరు త్వరగా పెవిలియన్ చేరితే హైదరాబాద్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుందని, అందుకే ప్రత్యర్థి జట్లు వీరిని దెబ్బకొట్టేందుకు కసరత్తులు చేస్తున్నాయని పుజారా అన్నారు. SRH బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా ఉందని, టాప్ ఆర్డర్ విఫలమైతే ప్రత్యర్థులు సులభంగా పైచేయి సాధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

తొలి పోరు డిఫెండింగ్ ఛాంపియన్స్‌తో..!

సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 28న డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. ఈ పోరులో ఆరెంజ్ ఆర్మీ తమ బ్యాటింగ్ పవర్‌ను ఎలా ప్రదర్శిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us