AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH Squad Analysis: ఇది స్వ్కాడ్ కాదు.. కావ్యపాప ఖతర్నాక్ బ్యాచ్.. ఆ ఒక్క వీక్‌నెస్ కొంపముంచేలా ఉందిగా?

SRH IPL 2026 Squad Analysis: ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. గత సీజన్‌లో నిరాశపరిచిన SRH, ఈసారి బలమైన జట్టుతో తిరిగి రావాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు బలం, బలహీనతలపై పూర్తి విశ్లేషణ ఓసారి చూద్దాం..

SRH Squad Analysis: ఇది స్వ్కాడ్ కాదు.. కావ్యపాప ఖతర్నాక్ బ్యాచ్.. ఆ ఒక్క వీక్‌నెస్ కొంపముంచేలా ఉందిగా?
Srh Ipl 2026 Squad Analysis
Venkata Chari
|

Updated on: Mar 17, 2026 | 4:48 PM

Share

SRH Playing XI 2026: గత సీజన్‌లో పాట్ కమిన్స్ నాయకత్వంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) టీం ఆరో స్థానంతో ముగించింది. 14 మ్యాచ్‌లలో 7 ఓటములు ఎదుర్కొని ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది. కానీ ఈసారి కొత్త ప్లేయర్లతో, సమతుల్య జట్టుతో బలంగా తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

SRH స్క్వాడ్ 2026..

ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, సలీల్ అరోరా, హెన్రిచ్ క్లాసెన్, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, బ్రైడన్ కార్సే, శివంగ్ కుమార్, క్రైన్స్ ఫులేట్రా, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమ్మిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కద్, ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, శివమ్ మావి.

SRH బలాలు: పవర్‌ఫుల్ బ్యాటింగ్ యూనిట్..

SRHకు ఈ సీజన్‌లో అతిపెద్ద బలం బ్యాటింగ్ లైనప్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ టాప్ ఆర్డర్‌లో అగ్రెసివ్ స్టార్ట్ ఇవ్వగలరు. ముఖ్యంగా కిషన్ ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద ప్లస్.

మిడిల్ ఆర్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి, అనికెత్ వర్మ మ్యాచ్ ఫినిషర్లుగా నిలవగలరు. స్పిన్‌పై క్లాసెన్ దూకుడు ప్రత్యేకం. అదనంగా స్మరణ్ రవిచంద్రన్ వంటి యువ ఆటగాడు ‘ఎక్స్ ఫ్యాక్టర్’గా మారే అవకాశం ఉంది.

ఆల్‌రౌండర్ల బలం SRHకు ప్లస్..

అభిషేక్ శర్మ నుంచి లియామ్ లివింగ్‌స్టోన్ వరకు అనేక ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. వీరు బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ ప్రభావం చూపగలరు. ఇది జట్టుకు ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది.

SRH బలహీనతలు: ఫాస్ట్ బౌలింగ్ లో లోటు..

మొహమ్మద్ షమీ లేని పరిస్థితిలో ఫాస్ట్ బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది. ఉనద్కద్ అనుభవం ఉన్నా, యంగ్ బౌలర్లు ఇంకా తమ ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంది.

పాట్ కమిన్స్ గాయంతో పూర్తిగా ఫిట్ కాకపోవడం, శివం మావి గాయం సమస్యలు SRHకు ఇబ్బందికరంగా మారవచ్చు. డెత్ ఓవర్లలో బౌలింగ్ పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.

పాట్ కమిన్స్ ఇప్పటికే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిచినా, IPL ట్రోఫీ మాత్రం దక్కలేదు. 2026 సీజన్ అతనికి ఆ లోటు తీర్చుకునే మంచి అవకాశం.

స్పిన్ డిపార్ట్‌మెంట్ కూడా..

ఆడమ్ జాంపా లాంటి కీలక స్పిన్నర్ లేకపోవడంతో SRH స్పిన్ బలహీనంగా కనిపిస్తోంది. జీషాన్ అన్సారిపై ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. ఇది మ్యాచ్‌ల్లో ప్రభావం చూపవచ్చు.

హైదారాబాద్ టీం ప్రాబబుల్ ప్లేయింగ్ XI (SRH Probable Playing XI)

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కీపర్), నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికెట్ వర్మ, హర్షల్ పటేల్, పాట్ కమిన్స్ (కెప్టెన్), జీషాన్ అన్సారి, ఇషాన్ మలింగా.

ఇంపాక్ట్ ప్లేయర్: స్మరణ్ రవిచంద్రన్

బలమైన బ్యాటింగ్, అనేక ఆల్‌రౌండర్లతో SRH ఈసారి డేంజరస్ టీమ్‌గా మారే అవకాశముంది. అయితే బౌలింగ్ సమస్యలు పరిష్కరించగలిగితేనే ప్లేఆఫ్స్ రేసులో నిలబడగలదు.

Follow Us