AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: జస్ట్ 2 నిమిషాల్లో సిలిండర్‌లో గ్యాస్ ఎంతుందో తెలుసుకోండి.. ఈ సింపుల్ టిప్ ఫాలో అయితే చాలు..

మీ ఇంట్లో వంట చేసేటప్పుడు గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో తెలియక టెన్షన్ పడుతున్నారా? అయితే మీ కోసమే ఈ అదిరిపోయే దేశీ జుగాడ్.. ఒక్క తడి గుడ్డ ఉంటే చాలు.. సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 2 కోట్ల మందిని ఆకర్షించిన ఈ వింత ట్రిక్ అసలు ఏంటి? ఇది నిజంగా పనిచేస్తుందా లేక కేవలం వ్యూస్ కోసమేనా? అనేది తెలుసుకుందాం..

Viral Video: జస్ట్ 2 నిమిషాల్లో సిలిండర్‌లో గ్యాస్ ఎంతుందో తెలుసుకోండి.. ఈ సింపుల్ టిప్ ఫాలో అయితే చాలు..
How To Check Your Lpg Cylinder Level At Home
Krishna S
|

Updated on: Mar 17, 2026 | 2:19 PM

Share

వంటగదిలో మహిళలను ఎక్కువగా వేధించే సమస్య.. వంట చేసే సమయంలో గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో తెలియకపోవడం. సరిగ్గా వంట మధ్యలో సిలిండర్ ఖాళీ అయితే వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఈ సమస్యకు పరిష్కారమంటూ సోషల్ మీడియాలో ఒక వింత దేశీ జుగాడ్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఏకంగా 2 కోట్లకు పైగా వ్యూస్‌తో ఈ వీడియో ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో @salve_6717 అనే హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియో ప్రకారం.. మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో తెలుసుకోవడానికి ఒక తడి గుడ్డ ఉంటే సరిపోతుంది.

ముందుగా సిలిండర్‌ను తడి గుడ్డతో పూర్తిగా తుడవాలి. రెండు నిమిషాల తర్వాత గమనిస్తే, సిలిండర్‌లో గ్యాస్ లేని పైభాగం త్వరగా ఆరిపోతుంది. గ్యాస్ ఉన్న కింది భాగం మాత్రం తేమగా ఉంటుంది. గ్యాస్ ఉన్నంత వరకు ఆ తేమ కనిపిస్తుందని, దాని ద్వారా గ్యాస్ లెవల్‌ను గుర్తించవచ్చని ఆ వీడియో సారాంశం. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘సిలిండర్‌ను తడి గుడ్డతో తుడిస్తే అది శుభ్రపడుతుంది కానీ గ్యాస్ ఎంత ఉందో ఎలా తెలుస్తుంది? అని ఒకరు ప్రశ్నిస్తే.. మా అమ్మ సిలిండర్‌ను ఒక్కసారి ఎత్తి పట్టుకుంటే చాలు.. అందులో ఎన్ని కేజీల గ్యాస్ ఉందో చెప్పేస్తుందని మరొకరు కామెంట్ చేశారు. నేను రోజంతా తడి గుడ్డతో తుడిచాను, గ్యాస్ సంగతేమో కానీ సిలిండర్ మాత్రం తళతళా మెరిసిపోతోందంటూ ఒక యూజర్ వ్యంగ్యంగా స్పందించారు.

నిపుణులు ఏమంటున్నారు?

ఈ పద్ధతిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నా, నిపుణులు మాత్రం దీన్ని పూర్తిగా నమ్మలేమని హెచ్చరిస్తున్నారు.

శాస్త్రీయత లేదు: ఇది శాస్త్రీయంగా నిరూపితమైన పద్ధతి కాదు.

వాతావరణ ప్రభావం: సిలిండర్ ఆరిపోయే వేగం అనేది గది ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ, వాతావరణంపై ఆధారపడి ఉంటుంది తప్ప, కేవలం గ్యాస్ లెవల్ మీద మాత్రమే కాదు.

ప్రత్యామ్నాయాలు: గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవడానికి బరువు చూడటం లేదా ప్రెజర్ గేజ్ వంటి పరికరాలను వాడటం సరైన పద్ధతి అని సూచిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Ashish Salve (@salve_6717)

Follow Us