Optical Illusion: మీ స్వభావం ఎలాంటిదో తెలుసుకోవాలా.. జస్ట్ వన్స్ ఈ ఫొటోపై ఓ లుక్కేయండి చాలు..

సోషల్ మీడియాలో పజిల్స్‌, ఆప్టికల్ ఇల్యూషన్స్‌ను నెటిజన్స్ బాగా లైక్ చేస్తున్నారు. తమ ఐ పవర్, ఐక్యూ పవర్ టెస్ట్ చేసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు. అలాంటి వారి కోసం..

Optical Illusion: మీ స్వభావం ఎలాంటిదో తెలుసుకోవాలా.. జస్ట్ వన్స్ ఈ ఫొటోపై ఓ లుక్కేయండి చాలు..
Optical Illusion
Follow us
Venkata Chari

|

Updated on: Aug 04, 2022 | 1:12 PM

ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ సందడి చేస్తున్నాయి. అవి చూడటానికి ఆసక్తిగా ఉండటమే కాదు, మనలోని లక్షణాలు, స్వభాలను కూడా ఇట్టే చెప్పేస్తుంటాయంటారు దీంతో వీటిపై నెటిజన్లు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఒకే ఫొటోలో వేర్వేరు వ్యక్తులు వేర్వేరు విషయాలను ఎలా గమనిస్తారనేది ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ చిత్రాల వెనుక ఉన్న కారణం మన మెదడు వాటిని భిన్నంగా గ్రహించడమేనని తెలుస్తుంది. తాజాగా ఓ ఆఫ్టికల్ ఇల్యూషన్ ఫొటో నెట్టింట్లో ఆకట్టుకుంటోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

టిక్ టాకర్ మరియా (maria_popova_dxb) షేర్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో దూసుకుపోయింది. సెల్ఫ్ డెవలప్‌మెంట్ కోచ్ మరియా నెటిజన్లకో ఫజిల్ విసిరారు. మీరు ఎలాంటి వారో తెలుసుకోవాలంటే ఈ ఫొటోను ఓ సారి చూడమంటూ చెప్పుకొచ్చారు. ఈ ఫొటోలో మీరు గమనించే దానిని బట్టి అంతర్ముఖులా, బహిర్ముఖులా లేదా యాంబివర్ట్ అని తెలుసుకోవచ్చు.

Optical Illusion

ఇవి కూడా చదవండి

మీరు చిత్రాన్ని ఓ ఫొటోను నిశితంగా పరిశీలించండి. ఇందులో మీరు మొదట ఏమి చూశారో గుర్తుంచుకోండి. ఫొటో మొత్తం ఊదా, నీలం, తెలుపు రంగులతో అనేక ఆకారాలను కలిగి ఉంది.

ఎంతో ఓర్పు: చిత్రంలో ఇద్దరు వ్యక్తులు చంద్రులను చూస్తున్నట్లు కనిపిస్తే వీరు అంతర్ముఖులని మరియా వెల్లడించింది. ఇలాంటి వారికి చాలా ఓర్పు, పట్టుదల ఉంటుంది.

స్నేహశీలి: రెండు ముఖాలను చూసినట్లయితే, వారు బహిర్ముఖులని తెలుస్తుంది. ఇలాంటి వారు చాలా స్నేహశీలిగా, ఆకర్షణీయమైన వ్యక్తిగా ఉంటారు. ఇలాంటి వారు కోరుకున్న అన్ని ఫలితాలను సాధించేందుకు చాలా బలమైన సంకల్పం కలిగి ఉంటారు.

ఆశాజనకులు: ఇదే కాదు ఈ చిత్రంలో సీతాకోకచిలుక ఫొటోను గమనిస్తే.. సందిగ్ధంలో ఉన్నారని ఆమె తెలియజేసింది.

ఇలాంటి వారు ఆశాజనకంగా ప్రవర్తిస్తుంటారు. ఇతరుల ఒత్తిడిని అస్సలు సహించలేరని పేర్కొంది. అలాగే ఇందులో సరిపోలని రెండు అక్షరాలను గుర్తిస్తే మాత్రం కొన్ని సందర్భాల్లో వీరు అంతర్ముఖులుగా, ఇతర సందర్భాల్లో మీరు బహిర్ముఖులుగా ఉంటారంట.