Viral Video: వామ్మో ఇదెక్కడి మ్యాజిక్.. కోతి రియాక్షన్ చూస్తే.. పడిపడి నవ్వాల్సిందే..

ఈ వీడియోలో హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే వ్యక్తి చేసిన మ్యాజిక్ చూసి కోతి ఇచ్చిన రియాక్షన్ చూస్తే మాత్రం పడిపడి నవ్వుకోవాల్సిందే.

Viral Video: వామ్మో ఇదెక్కడి మ్యాజిక్.. కోతి రియాక్షన్ చూస్తే.. పడిపడి నవ్వాల్సిందే..
Monkey Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Aug 03, 2022 | 4:46 PM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వచ్చి చేరుతుంటాయి. వీటిలో కొన్ని నెటిజన్లను ఆకట్టుకోవడంతో తెగ వైరల్ అవుతుంటాయి. ఇందులో జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రధమస్థానంలో నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లోకి వచ్చి చేరింది. ఓ వ్యక్తి జూకి వెళ్లి అక్కడ ఓ కోతికి తన మ్యాజిక్ ట్రిక్ చూపించాడు. కోతి ఇలాంటి మాయాజాలాన్ని తొలిసారి చూసినట్లుగా, ఓ వింత ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం చూసి, నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోలో హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి చేసిన మ్యాజిక్ చూసి కోతి ఇచ్చిన రియాక్షన్ చూస్తే పడిపడి నవ్వుకోవాల్సిందే. ఈ వైరల్ వీడియో పుబిటి ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. కోతి రియాక్షన్ నచ్చడంతో ఈ వీడియో 12 మిలియన్లకు పైగా వ్యూస్‌తో నెట్టింట్లో తన సత్తా చాటుతోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Pubity (@pubity)

వైరల్ అవుతున్న వీడియోలో, వ్యక్తి జూలో ఒక కోతికి మ్యాజిక్ ట్రిక్స్ చూపిస్తున్నట్లు చూడొచ్చు. అయితే కోతి అతను ఏమి చేస్తున్నాడో చూడాలనే ఆసక్తితో వ్యక్తిని గమనిస్తున్నట్లు చూడొచ్చు. ఆ వ్యక్తి ఓ మ్యాజిక్ చేసి, ఓ వస్తువును మాయం చేయగా, కోతి కాసేపు ఆలోచించి, ఆశ్చర్యపోయినట్లుగా వింతగా రియాక్షన్ ఇస్తుంది. ప్రజలు కోతి ప్రతిచర్యను చాలా ఇష్టపడ్డారు. ఫన్నీ కామెంట్లతో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్ నెవ్వర్ భిపోర్, ఎవర్ ఆఫ్టర్ అంటూ స్పందిస్తున్నారు.