AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: టేకాఫ్‌కి సిద్ధమైన విమానం.. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన కారు.. వైరల్ వీడియో

ఈ ఘటనకు గల కారణాలు గురించి డీజీసీఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుందని అధికారులు తెలిపారు. సదరు కారు డ్రైవర్‌ మద్యం సేవించి ఇలా ర్యాష్‌గా..

Viral Video: టేకాఫ్‌కి సిద్ధమైన విమానం.. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన కారు.. వైరల్ వీడియో
Go First Car Goes Under Indigo Plane Viral Video
Venkata Chari
|

Updated on: Aug 02, 2022 | 5:51 PM

Share

Trending Video: ఢిల్లీ విమానాశ్రంయలో కట్టుదిట్టమైన భద్రత నడుమ రెప్ప పాటులో పెను ప్రమాదం తప్పింది. ఇండిగో విమానం పాట్నాకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఇంతలో గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన కారు.. విమానం కిందకు వెళ్లిపోయింది. వాస్తవానికి విమానం ముందు చక్రానికి ఢీ కొట్టిందేమోనని అక్కడ ఉన్న అధికారులు టెన్షన్‌తో ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఐతే తృటిలో పెద్ద పెను ప్రమాదం తప్పింది. దీంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు.

విమానానికి ఉన్న ముందు చక్రానికి వెంట్రుకవాసి దూరంలో ఈ కారు ఆగిపోయింది. ఈ ఘటనకు గల కారణాలు గురించి డీజీసీఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుందని అధికారులు తెలిపారు. సదరు కారు డ్రైవర్‌ మద్యం సేవించి ఇలా ర్యాష్‌గా కారు నడిపాడేమోనని బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్ష కూడా నిర్వహించారు. ఐతే నెగిటివ్‌ వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో విమానానికి ఎలాంటి నష్టం జరగలేదు. ఎవరూ గాయపడలేదు. ఐతే ఈ ఘటన పై ఇండిగో కానీ గో ఫస్ట్‌ గానీ స్పందించ లేదు. కానీ, ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..