Rohit Sharma: హిట్‌మ్యాన్ ఖాతాలో చెత్త రికార్డ్.. టాప్ 5లో ఎవరున్నారంటే?
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ అత్యధికంగా 3443 పరుగులు చేశాడు. అత్యధికంగా 4 సెంచరీలు కూడా అతని పేరు మీద ఉన్నాయి. అయితే ఏ బ్యాట్స్‌మెన్ కూడా కోరుకోని ఓ చెత్త రికార్డు రోహిత్ సరసన చేరింది.
క్రికెట్ ప్రపంచంలో హిట్‌మ్యాన్‌గా పేరుగాంచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట న్నో భారీ రికార్డులు కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధికంగా 3443 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కాగా అత్యధికంగా 4 సెంచరీలు కూడా అతని పేరు మీద ఉన్నాయి. అయితే ఏ బ్యాట్స్‌మెన్ ఇష్టపడని ఓ చెత్త రికార్డు రోహిత్ పేరిట చేరింది. అత్యధిక సార్లు డకౌట్లు అయ్యాడు. అత్యధికంగా 8 సార్లు డకౌట్ అయిన తొలి భారత క్రికెటర్ రోహిత్ నిలిచాడు. సోమవారం (ఆగస్టు 1) వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో తొలి బంతికే ఔటైన రోహిత్ గోల్డెన్ డక్‌తో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ విధంగా, అతను తన ఇబ్బందికర రికార్డులో మరింత ముందుకు చేరుకున్నాడు. రోహిత్ తర్వాత కేఎల్ రాహుల్ రెండవ ర్యాంక్‌లో ఉన్నాడు. రాహుల్ ఇప్పటివరకు 4 సార్లు సున్నాకి ఔటయ్యాడు. ఈ విధంగా ఈ రికార్డుకు అగ్రస్థానంలో ఉన్న రోహిత్ అందరికి దూరంగా నిలిచాడు.
అత్యధిక ‘గోల్డెన్ డకౌట్లు’ కలిగిన టాప్ 2 భారతీయ ఆటగాళ్లు..
రోహిత్ శర్మ – 8 డకౌట్లు కేఎల్ రాహుల్ – 4 డకౌట్లు
వీరిద్దరి తర్వాత శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, యూసుఫ్ పఠాన్, సురేశ్ రైనా, వాషింగ్టన్ సుందర్, ఆశిష్ నెహ్రా తలో 3 డకౌట్లతో సమానంగా మూడో స్థానంలో నిలిచారు.
రోహిత్ శర్మ – T20 ఇంటర్నేషనల్ కెరీర్ రికార్డులు..
అత్యధిక పరుగులు -3443 (ఓవరాల్) అత్యధిక సెంచరీలు – 4 (ఓవరాల్) అత్యధిక సిక్సర్లు – 159 (భారత బ్యాట్స్‌మెన్) అత్యధిక డకౌట్లు – 8 (భారత బ్యాట్స్‌మెన్)
రెండో టీ20లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో విజయం..
విండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 19.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. హార్దిక్ పాండ్యా అత్యధికంగా 31, రవీంద్ర జడేజా 27 పరుగులు చేశారు. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ ఒబెడ్ మెక్‌కాయ్ 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో విండీస్ జట్టు 5 వికెట్లకు 145 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ బ్రెండన్ కింగ్ 68 పరుగుల అత్యధిక ఇన్నింగ్స్ ఆడి, జట్టును గెలిపించాడు.