Asia Cup 2022 Schedule: ఆసియాకప్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
IND vsPAK: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఆసియా కప్ షెడ్యూల్‌ను ఎట్టకేలకు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం అందరి చూపు భారత్, పాకిస్థాన్ పోరుపైనే నిలిచింది. ఈ టోర్నో ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరగనుంది.
Asia Cup 2022 Schedule: క్రికెట్ మైదానంలో భారత్-పాకిస్థాన్(IND vsPAK) మరోసారి తలపడనున్నాయి. ఆసియా కప్‌లో ఇరు జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. అయితే, ఎన్నో రోజులుగా ఫ్యాన్స్ ఎదురుచూస్తోన్న షెడ్యూల్ వచ్చేసింది. ఆసియా కప్ షెడ్యూల్ ఎట్టకేలకు నేడు విడుదలైంది. దీని ప్రకారం ఆగస్టు 28న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరగనుంది. ముందుగా శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ, అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఈ టోర్నీని యూఏఈకి మార్చిన సంగతి తెలిసిందే.
Men’s #AsiaCup2022 schedule released. India will face Pakistan on 28th August. pic.twitter.com/TiTqVgiUYL
— ANI (@ANI) August 2, 2022
ఆసియా కప్ షెడ్యూల్ ఎలా ఉందంటే?
ఆసియా కప్‌లో భాగంగా ఆగస్టు 27న శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత ఆగస్టు 28 ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య పోరు జరగనుంది. బంగ్లాదేశ్ జట్టు కూడా ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటుంది. అలాగే క్వాలిఫయర్ జట్టు కూడా ఆసియా కప్‌లో ఆడనుంది. జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ Aలో భారత్-పాకిస్థాన్, క్వాలిఫయర్ జట్లు ఉన్నాయి. గ్రూప్ బీలో శ్రీలంక-ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. 2018లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి, భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.
ఆసియా కప్‌లో టీమిండియాకు ఎదురేలేదు..
ఆసియాకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. భారత జట్టు 7 సార్లు ఆసియా కప్‌ను గెలుచుకుంది. అయితే పాకిస్థాన్ కేవలం రెండు సార్లు మాత్రమే ఆసియా కప్‌ను గెలుచుకుంది. పాకిస్థాన్ చివరిసారిగా 2012లో ఆసియా కప్ గెలిచింది. ఈ టోర్నీని శ్రీలంక నాలుగుసార్లు గెలుచుకోవడం విశేషం.
ఆసియాకప్‌లో పాకిస్థాన్‌పైనా తగ్గేదేలే అంటోన్న భారత్..
ఐసీసీ టోర్నీల మాదిరిగానే ఆసియా కప్‌లో కూడా పాకిస్థాన్‌పై భారత జట్టు సత్తా చాటుతోంది. ఆసియా కప్‌లో భారత్ వన్డే, టీ20 ఫార్మాట్లలో పాక్‌ను ఓడించింది. టీ20 ఫార్మాట్ గురించి మాట్లాడితే, పాకిస్థాన్‌తో ఆడిన ఒక మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. వన్డే ఫార్మాట్‌లో భారత్ 13 మ్యాచుల్లో 7 గెలిచింది. యూఏఈ గడ్డపై జరిగిన ఆసియా కప్‌లో భారత్ 4 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ను ఓడించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..