Viral: టీవీ చూస్తుండగా కనిపించిన చిన్న రంధ్రం.. ఏంటా అని చూడగా దెబ్బకు మైండ్ బ్లాంక్.!
సర్వీస్ కింద అందించే గదుల్లో రహస్య కెమెరాలు ఉన్నాయని నిత్యం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో..
డిజిటల్ యుగంలో ప్రైవసీ ప్రధాన సమస్యగా మారింది. ఇంట్లోంచి బయటకు వెళ్తే.. మనకు భద్రత ఉందా అనే సందేహం వస్తుంది. హాస్టళ్ల నుంచి మొదలు పబ్లిక్ టాయిలెట్స్, డ్రెస్ ఛేంజింగ్ రూమ్స్ వరకు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సీక్రెట్ కెమెరాలు అమర్చి మనల్ని పరిశీలిస్తుంటారు. ఏ ప్రదేశంలో కెమెరాలు అమర్చారోనని భయపడాల్సి వస్తుంది. రోజురోజుకు ఇలాంటి నేరాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కెనడాలోని ఓ ప్రముఖ కంపెనీ వివాదంలో చిక్కుకుంది. Airbnb అనేది కెనడాలోని కస్టమర్‌లకు హోటల్‌లు, గెస్ట్‌హౌస్‌లు, గదులతో సహా వసతిని అందించే సంస్థ. చాలా మంది కెనడియన్లు ఈ ప్రసిద్ధ కంపెనీ ద్వారా అద్దె ప్రాపర్టీల కోసం శోధిస్తారు. రెండు రోజులు బస చేసినా లేదా కొన్ని నెలలపాటు బస చేసినా.. బడ్జెట్‌కు అనుగుణంగా వసతిని అందిస్తుంది. ఎంతో పేరు తెచ్చుకున్న ఈ కంపెనీ ప్రస్తుతం వివాదంలో చిక్కుకోవడంతో కస్టమర్లు అంతా అయోమయంలో పడ్డారు.
Airbnb సర్వీస్ కింద అందించే గదుల్లో రహస్య కెమెరాలు ఉన్నాయని నిత్యం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కెనడాకు చెందిన ఓ కుటుంబం కెమెరా వివాదానికి తెరలేపింది. కెనడాలోని బ్రోంప్టన్‌కు చెందిన జాబ్ కుటుంబం Airbnb ద్వారా ఒక ఇంటిని అద్దెకు తీసుకుంది. జాజ్ తన ముగ్గురు కజిన్స్‌తో కలిసి టీవీలో సినిమా చూస్తున్నాడు. అందులో ఒకరు టీవీ ఉన్న టేబుల్ వైపు చూశారు. టేబుల్ దిగువన ఒక రంధ్రం ఉంది. అందులో ఓ సీక్రెట్ కెమెరా ఉండడం గమనించి, షాక్ అయ్యారు. దీంతో షకనా తన సెల్‌ఫోన్‌లో ఓ ఫొటోను తీసి ఆ కంపెనీకి ఫిర్యాదు చేసింది.
భద్రతా కారణాల దృష్ట్యా, అవసరమైన చోట నిర్దిష్ట ప్రదేశాలలో దీన్ని ఇన్‌స్టాల్ చేయవచ్చని జాస్ తెలియజేశారు. అవసరం లేకుండా ఇంట్లో ఎందుకు ఉంచారో తెలియడం లేదని ఆయన పేర్కొన్నాడు. దీనిపై వివరణ ఇచ్చిన సంస్థ.. మేం కస్టమర్ గోప్యతకు విలువిస్తాం. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాం. కొంతమంది వినియోగదారులకు పూర్తి వాపసు ఇచ్చినట్లు పేర్కొంది.