Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వేగంగా పరిగెత్తాలంటూ కోచ్ సిగ్నల్.. కట్ చేస్తే.. స్లో మోషన్‌తో నవ్వులు పూయించిన బుడ్డోడు.. వైరల్ వీడియో

ఈ వీడియోను టాబీ ట్విట్టర్‌లో అప్ లోడ్ చేశాడు. దీంతో నెటిజన్లు తెగ నవ్వుకుంటూ, కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటికే 2 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్‌తో నెట్టింట్లో దూసుకపోతోంది.

Viral Video: వేగంగా పరిగెత్తాలంటూ కోచ్ సిగ్నల్.. కట్ చేస్తే.. స్లో మోషన్‌తో నవ్వులు పూయించిన బుడ్డోడు.. వైరల్ వీడియో
Boy Slow Running Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Aug 02, 2022 | 6:02 PM

నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరలవుతుంటాయి. అందులో కొన్ని నవ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. మరికొన్ని షాక్ ఇస్తుంటాయి. వీటిలో చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు అగ్రస్థానంలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి చేష్టలకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో సందడి చేస్తోంది. ఇందులో ఓ చిన్నారి చేసిన పనికి సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ వీడియో చూసి మీరు కూడా ఆ బాలుడి రియాక్షన్‌కు సలాం చేస్తారు.

కాలిఫోర్నియాలో వాల్‌నట్‌లో తన కజిన్ లిటిల్ లీగ్ గేమ్‌ను చూసేందుకు వెళ్లిన టాబీ వెళ్లాడు. అక్కడ ఓ బాలుడు తన యాక్షన్‌తో ఆకట్టుకోవడం చూసి, వీడియో తీసి నెట్టింట్లో అప్‌లోడ్ చేసేశాడు. స్టాండ్స్‌లో నిల్చుని ఆటను చూస్తున్న టాబీ.. బేస్ బాల్‌ ఆటలో నిమగ్నమైన పిల్లాడిని గమనిస్తున్నాడు. ఇంతలో వీలైనంత వేగంగా గమ్యస్థానానికి చేరుకోవాలని కోచ్ ఆ పిల్లాడికి సూచించాడు. అయితే, ఆ బాలుడికి మాత్రం మరోలా వినిపించిందో ఏమో కానీ, వీలైనంత వేగంతో కాకుండా, స్లో మోషన్ నడకతో నవ్వులు పూయించాడు. ఈ వీడియోను టాబీ ట్విట్టర్‌లో అప్ లోడ్ చేశాడు. దీంతో నెటిజన్లు తెగ నవ్వుకుంటూ, కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటికే 2 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్‌తో నెట్టింట్లో దూసుకపోతోంది.

ఇవి కూడా చదవండి

పిల్లాడు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే, ముందుముందు ఓ స్టార్ హీరో అవుతాడని కొందరు, కామెడీ స్టార్ అవుతాడని మరికొందరు కామెంట్లతో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.