Viral: వాట్సాప్‌లో ఫ్రెండ్‌కు మెసేజ్ చేస్తుండగా.. యువతి నుంచి న్యూడ్ వీడియో కాల్.. సీన్ కట్ చేస్తే!

ఓ వ్యక్తి తన ఫ్రెండ్‌కు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తుండగా.. ఓ గుర్తుతెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. ఎవరై ఉంటారోనని..

Viral: వాట్సాప్‌లో ఫ్రెండ్‌కు మెసేజ్ చేస్తుండగా.. యువతి నుంచి న్యూడ్ వీడియో కాల్.. సీన్ కట్ చేస్తే!
Whatsapp Video Call
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 02, 2022 | 6:05 PM

ఓ వ్యక్తి తన ఫ్రెండ్‌కు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తుండగా.. ఓ గుర్తుతెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. ఎవరై ఉంటారోనని ఆన్సర్ చేసి చూడగా.. అవతలి వైపు ఓ మహిళ నగ్నంగా దర్శనమిచ్చింది. సీన్ కట్ చేస్తే.. క్షణాల్లో కథలో అనూహ్య ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అవేంటంటే.!

వివరాల్లోకి వెళ్తే.. భువనేశ్వర్‌కు చెందిన ఓ బీఎస్ఎన్ఎల్ ఇంజనీర్.. తన ఫ్రెండ్‌కు వాట్సాప్ నుంచి మెసేజ్ చేస్తుండగా.. ఓ గుర్తుతెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. ఈ నెంబర్ ఎవరిదై ఉంటుందోనన్న డౌట్‌తో.. తెలుసుకుంటేపోలే అని ఆన్సర్ చేశాడు. అంతే! అతడు షాక్ అయ్యేలా అవతలి వైపు ఓ మహిళ నగ్నంగా కనిపించింది. దెబ్బకు దడుసుకుని కాల్ కట్ చేశాడు.

అయితే ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సైబర్ నేరగాళ్లు ఆ వాట్సాప్ వీడియో మొత్తాన్ని రికార్డు చేసేశారు. అంతేకాదు దాన్ని మార్ఫింగ్ చేసి.. ఆ ఇంజనీర్‌ను రూ. 25 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించారు. డబ్బు ఇస్తే వీడియో భద్రంగా ఉంటుందని.. లేదంటే ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో తన పరువు పోతుందని భయపడ్డ ఇంజనీర్.. వాళ్లకు డబ్బులు అందజేశాడు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, బాధితుడు నమోదు చేసిన ఫిర్యాదు మేరకు ఖాకీలు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..