Viral: కడుపు ఉబ్బిపోయి.. తీవ్రమైన నొప్పితో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. స్కాన్ చేయగా ఖంగుతిన్న డాక్టర్లు!
ఇదొక క్రేజీ న్యూస్ అని చెప్పాలి. రాజస్థాన్‌లోని డాక్టర్లు అత్యంత అసాధారణమైన శస్త్రచికిత్సను నిర్వహించి..
ఇదొక క్రేజీ న్యూస్ అని చెప్పాలి. రాజస్థాన్‌లోని డాక్టర్లు అత్యంత అసాధారణమైన శస్త్రచికిత్సను నిర్వహించి ఒక వ్యక్తి కడుపులో నుంచి సుమారు 63 నాణేలను తొలగించారు. ఇంతకీ ఆ కథేంటి.? అసలేం జరిగింది.? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళ్తే.. జోద్‌పూర్‌లోని ఎండీఎం ఆసుపత్రికి కడుపు ఉబ్బిపోయి.. తీవ్రమైన నొప్పితో ఓ వ్యక్తి వచ్చాడు. అక్కడున్న డాక్టర్లు అతడికి పలు టెస్టులు నిర్వహించారు. అసలెందుకు కడుపు నొప్పి వస్తోందో అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా పలు టెస్టులను సైతం నిర్వహించారు. 10-15 నాణేలను మింగినట్లుగా సదరు వ్యక్తి డాక్టర్లకు చెప్పగా.. రిపోర్ట్స్‌లో మాత్రం భారీ సైజ్‌లో లోహపు ముద్ద కడుపులో ఉన్నట్లు తేలింది. దీంతో ఆ హాస్పిటల్ డాక్టర్లు శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలను సిద్దం చేసుకుని.. రెండు రోజుల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం ఆ వ్యక్తి కడుపు నుంచి సుమారు 63 నాణేలను బయటికి తీశారు. కాగా, ప్రస్తుతం రోగీ ఆరోగ్యంగానే ఉన్నాడని.. కొద్దిరోజుల పర్యవేక్షణ అనంతరం అతడ్ని డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..