AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: చెట్లు నాటేందుకు మట్టి తవ్వుతుండగా బయటపడ్డ అద్భుతం.. ఏంటా అని చూడగా కళ్లు జిగేల్!

ఓ జంట ఎంతగానో ముచ్చటపడి నాలుగేళ్ల కిందట 1920వ సంవత్సరంలో నిర్మించబడిన ఓ కాటేజీని కొనుగోలు చేసింది. ఇక తమకు..

Viral: చెట్లు నాటేందుకు మట్టి తవ్వుతుండగా బయటపడ్డ అద్భుతం.. ఏంటా అని చూడగా కళ్లు జిగేల్!
Viral
Ravi Kiran
|

Updated on: Jul 31, 2022 | 12:30 PM

Share

ఓ జంట ఎంతగానో ముచ్చటపడి నాలుగేళ్ల కిందట 1920వ సంవత్సరంలో నిర్మించబడిన ఓ కాటేజీని కొనుగోలు చేసింది. ఇక తమకు నచ్చిన విధంగా ఆ ఇంటికి కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఈ క్రమంలోనే ఇంటి బయట చెట్లు నాటేందుకు మట్టిని తవ్వారు. అంతే! అక్కడ కనిపించిన దృశ్యం చూసి వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఆ కథేంటంటే.!

వివరాల్లోకి వెళ్తే.. రిచర్డ్, సుజేన్ గిల్సన్ అనే జంట న్యూయార్క్‌లోని వైల్డ్‌వుడ్ ప్రాంతంలో నాలుగేళ్ల క్రితం ఓ చిన్న కాటేజీని కొనుగోలు చేశారు. అదేమో 1920వ సంవత్సరం నిర్మించబడినది. అందుకే వారు తమకు నచ్చిన విధంగా ఆ ఇంటికి కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఈ క్రమంలోనే రిచర్డ్ ఇంటి ముందు కొన్ని చెట్లు నాటేందుకు మట్టిని తవ్వగా.. కొన్ని ప్యాకెట్లు బయటపడ్డాయి. ముందుగా ఆ జంట వాటిని గంజాయి ప్యాకెట్లని భావించారు. అయితే ఆ తర్వాత అవి గట్టిగా కట్టబడి ఉన్న నోట్ల కట్లని వారికి అర్ధమైంది. ఆ మొత్తం అంతా 2 వేల డాలర్లుగా తేలింది. ఆశ్చర్యపోయిన రిచర్డ్.. విషయాన్నీ మొత్తం తన భార్య సుజేన్‌కు చెప్పాడు. ఆ నోట్లన్నీ కూడా 1934 కాలానికి చెందినవని.. ఇప్పుడు వాటి విలువ సుమారు 40 వేల డాలర్లు ఉంటుందని చెప్పాడు.

ఇదిలా ఉంటే.. ఆ జంట ఈ క్యాష్ ఎవరిది.? ఇక్కడెందుకు పాతిపెట్టారు.? అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలోనే మొదటిగా ఈ క్యాష్ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించినదై ఉంటుందని భావించింది. అనంతరం ఆ ఇంటి అసలు ఓనర్‌ మనవరాలితో మాట్లాడిన తర్వాత మనీ మిస్టరీ ఎట్టకేలకు సాల్వ్ అయింది. ఆ జంట కొలొరాడో‌లో ఉన్న జేమ్స్ డెంప్సీ మనవరాలితో ఈ క్యాష్ గురించి మాట్లాడింది. తన తాత కొంత డబ్బును ఇచ్చి ఇంటి ముందు నేల కింద పాతిపెట్టమని అప్పట్లో తన తల్లికి చెప్పినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఎంత వెతికినా ఆ డబ్బు దొరకలేదని తెలిపింది. ఇప్పుడు ఆ డబ్బు దొరకడంతో ఆమె.. తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.

సుమారు 2 వేల డాలర్లు. అంటే పెద్ద మొత్తమే.. వీటి వల్ల మా జీవితాలు మారిపోవు. కాని ఆ నోట్ల వెనుక దాగున్న కథ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. 90 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి చేసిన పనికి ఇవి సాక్ష్యంగా మిగిలాయి. ఈ డబ్బులతో ఏం చేయబోతున్నారని చాలామంది ప్రజలు నన్ను అడిగారు. నేను మాత్రం వాటిల్లో ఒక్క డాలర్ కూడా ఖర్చు పెట్టను” అని రిచర్డ్ గిల్సన్ చెప్పాడు.(Source)

Follow Us
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్