Viral: సూట్‌కేస్‌లో నుంచి బట్టలు తీస్తుండగా మహిళకు షాక్.. దూసుకొచ్చిన అనుకోని అతిధి.. దెబ్బకు గుండె గుభేల్
ఆ యువతి తన వెకేషన్‌ను పూర్తి చేసుకుని ఇంటికి తిరిగొచ్చింది. ఎప్పటిలానే యధాలాపంగా తన సూట్‌కేస్‌లోని..
ఆ యువతి తన వెకేషన్‌ను పూర్తి చేసుకుని ఇంటికి తిరిగొచ్చింది. ఎప్పటిలానే యధాలాపంగా తన సూట్‌కేస్‌లోని బట్టలు బయటికి తీసి సర్దుకుంటోంది. అయితే ఈలోపు ఓ అనుకోని అతిధి ఒక్కసారిగా దూసుకొచ్చింది. అంతే! ఆమె దెబ్బకు దడుసుకుంది. ఇంతకీ అసలేం జరిగింది.? చివరికి ఏమైంది.?
వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రియాకు చెందిన ఓ యువతి ఇటీవల వెకేషన్ నిమిత్తం క్రోయేషియాకు వెళ్లింది. కొద్దిరోజులు తర్వాత ఈ శనివారం తిరిగి ఇంటికొచ్చింది. యధాలాపంగా ఇంటికి వచ్చిన తర్వాత తన సూట్‌కేస్‌లోని బట్టలు తీసి సర్దుతుండగా.. ఆమె ఒక్కసారిగా ఊహించని షాక్ తగిలింది. సుమారు 18 తేళ్లు బట్టల్లో ఉండటం గుర్తించింది. వాటిని చూడగానే దెబ్బకు దడుసుకుంది. సమాచారాన్ని వెంటనే యానిమల్ రెస్క్యూ సిబ్బందికి తెలియజేసింది. వారు స్పాట్‌కు చేరుకొని తేళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే, ఆస్ట్రియాలో ఈ విధంగా తేళ్ళను పట్టుకోవడం ఇది మూడోవసారి కావడం గమనార్హం. గత నెల లింజ్ అనే మహిళ తన వెకేషన్ ముగించుకుని ఇంటికొచ్చిన మూడు వారాలకు ఇలాంటి తేళ్ళను తన బట్టల బ్యాగ్‌లో గుర్తించింది. కాగా, ప్రపంచంలో సుమారు 2000 వేల జాతుల తేళ్లు ఉన్నాయి. వాటిలో 30 నుంచి 40 జాతులకు చెందిన తేళ్లలో మాత్రమే మనుషులను చంపగలిగే విషం ఉంటుంది. అటు క్రొయేషియాలోని పలు ప్రాంతాల్లో కనిపించే తేళ్లు ఎలాంటి ప్రాణహాని తలపెట్టవు. అయినప్పటికీ, అవి కుట్టడం వల్ల కుట్టిన చోట నొప్పి, వాపు, దురద లాంటి లక్షణాలు ఉంటాయి.