Trending: అదృష్టం ఇంటికొచ్చి మరీ తలుపు తట్టింది.. లాటరీలో రూ.పది వేల కోట్లు తెచ్చిపెట్టింది.. కానీ

అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో ఎప్పుడూ ఊహించలేం. కొందరికి అదృష్టం వరించినా అందుకునే అవకాశం ఉండదు. మరికొందరు అదృష్టం తో తమకు ఏమైనా లబ్ధి జరుగుతుందేమోనని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ...

Trending: అదృష్టం ఇంటికొచ్చి మరీ తలుపు తట్టింది.. లాటరీలో రూ.పది వేల కోట్లు తెచ్చిపెట్టింది.. కానీ
Lottery
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 31, 2022 | 12:00 PM

అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో ఎప్పుడూ ఊహించలేం. కొందరికి అదృష్టం వరించినా అందుకునే అవకాశం ఉండదు. మరికొందరు అదృష్టం తో తమకు ఏమైనా లబ్ధి జరుగుతుందేమోనని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా లాటరీలో 10,136 కోట్లు గెలుచుకున్నాడు. కానీ అతనెవరనేది తెలియకపోవడం కొసమెరుపు. ఇప్పుడు ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో మెగా మిలియన్స్ అనే సంస్థ నిర్వహించిన లాటరీలో.. ఓ వ్యక్తి రెండు డాలర్లు పెట్టి ఓ లాటరీ టికెట్ కొన్నాడు. ఆ రెండు డాలర్లు అతన్ని కోటీశ్వరుడ్ని చేశాయి. ఏకంగా 1.28 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్‌ కరెన్సీలో రూ.10,136 కోట్లు జాక్‌పాట్ తగిలింది. లాటరీ కొట్టిన ఈ టికెట్ వివరాలను ఆ సంస్థ తాజాగా ప్రకటించింది.

ఇల్లినాయిస్ రాష్ట్రంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఈ టికెట్ అమ్ముడైనట్టు మెగా మిలియన్స్ తెలిపింది. అయితే, ఆ వ్యక్తి ఎవరనే విషయం తెలియరాలేదు. ప్రభుత్వ ఆధర్యంలో నిర్వహించే ఈ లాటరీలో 2015 నుంచి జరిగిన 29 డ్రాలలో ఇప్పటి వరకూ ఒక్కరు కూడా జాక్‌పాట్ కొట్టలేదు. తాజాగా ఓ వ్యక్తికి ఆ అదృష్టం పట్టింది. అంతేకాదు, అమెరికాలో గత ఐదేళ్లలో ఇదే అతిపెద్ద జాక్‌పాట్ అంటున్నారు. ఆ దేశ చరిత్రలోనే ఇది మూడో అతిపెద్ద జాక్‌పాట్ అట. చూడాలి మరి.. ఆ వ్యక్తి జాడ ఎప్పటికి తెలుస్తుందో..!

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?