Office: ఆఫీస్ లో నిద్రకు కంపెనీలు ఓకే.. ఉద్యోగులు కునుకు తీసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు
ఉరుకుల పరుగుల జీవితంలో హాయిగా నిద్రపోవడమే (Sleeping) గగనమైపోయింది. ఆఫీస్ పనులు, వివిధ కార్యక్రమాలు, గాడ్జెట్ల వినియోగం వంటి వివిధ కారణాలతో రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోవడం లేదు. ఫలితంగా ఆఫీసులో కునుకుపాట్లు పడుతున్నారు. అయితే....
ఉరుకుల పరుగుల జీవితంలో హాయిగా నిద్రపోవడమే (Sleeping) గగనమైపోయింది. ఆఫీస్ పనులు, వివిధ కార్యక్రమాలు, గాడ్జెట్ల వినియోగం వంటి వివిధ కారణాలతో రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోవడం లేదు. ఫలితంగా ఆఫీసులో కునుకుపాట్లు పడుతున్నారు. అయితే ఆఫీస్ కు వెళ్లాక నిద్రముంచుకురావడం తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేశాక ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది. కనీసం ఓ అర గంట పాటు నిద్రపోవాలని అనుకుంటారు. కాసేపు కునుకు తీయడం వల్ల పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని, మానసిక ఆందోళన దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. చాలా సంస్థలు కూడా తమ ఉద్యోగులు (Employees), సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిద్రపోయేందుకు అనుమతిస్తున్నాయి. వీరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జపాన్ (Japan) కు చెందిన కొయొజు ప్లైవుడ్ కార్పొరేషన్ సంస్థ వినూత్న చర్యకు ముందడుగు వేసింది. తమ సంస్థలోని ఉద్యోగులు నిద్రపోయేందు వీలుగా సౌకర్యవంతంగా ఉండే ‘న్యాప్ బాక్స్’లను అందుబాటులోకి తీసుకువచ్చింది. శరీరానికి పూర్తి విశ్రాంతి ఇచ్చేలా ఇందులో టెంపరేచర్ ను సెట్ చేస్తారు. దీంతో ఉద్యోగులు హాయిగా ఓ అరగంట పాటు కునుకుతీయొచ్చు.
మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఈ బాక్సుల్లో అలాగే నిలబడి నిద్ర పోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ న్యాప్ బాక్స్ లకు స్థానిక భాషలో ‘కమిన్ బాక్స్’లుగా పిలుస్తారు. ఇవి నిలువుగా ఉండి తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఎక్కడైనా ఆఫీసులో నిద్ర అనగానే వింతగా చూస్తారు. కానీ జపాన్ లో అలా కాదు. ఉద్యోగులు ఆఫీసు సమయంలో కూడా పది, ఇరవై నిమిషాల పాటు నిద్ర పోవడానికి కంపెనీలు అనుమతిస్తాయి. ఇలా నిద్రపోవడాన్ని ‘పవర్ న్యాప్’ అంటారు. దీనివల్ల ఒత్తిడి, అలసట వంటివి తగ్గిపోతాయని, పవర్ న్యాప్ తర్వాత ఉత్సాహంగా పని చేయగలుగుతారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఇందుకు అనుగుణంగానే జపాన్ సంస్థలు ఈ వెసులుబాటును అందుబాటులోకి తీసుకువచ్చాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..