US Shooting: అమెరికాలో ఆగని గన్ కల్చర్.. కారు ఆపినందుకు పోలీస్ అధికారిపైనే కాల్పులు..

ట్రాఫిక్ స్పాట్‌లో పోలీసు అధికారి కారును ఆపడంతో దుండగుడు ఈ దారుణానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది.

US Shooting: అమెరికాలో ఆగని గన్ కల్చర్.. కారు ఆపినందుకు పోలీస్ అధికారిపైనే కాల్పులు..
Us Shooting
Follow us

|

Updated on: Aug 01, 2022 | 6:30 AM

Indiana officer killed: అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ కల్చర్ పెచ్చుమీరుతోంది. నిరంతరం జరుగుతున్న కాల్పుల ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా ఇండియానా పోలీసు అధికారిని దుండగుడు కాల్చి చంపారు. ట్రాఫిక్ స్పాట్‌లో పోలీసు అధికారి కారును ఆపడంతో దుండగుడు ఈ దారుణానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్న సమయంలో దుండగుడు కారులోంచి దిగి కాల్పులు జరపడంతో పోలీసు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన అనంతరం వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. 30 నిమిషాల్లోనే నిందితుడిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. మరణించిన అధికారి ఇండియానా పోలిస్‌కు ఈశాన్యంగా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్‌వుడ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆఫీసర్ నోహ్ షానవాజ్ (24) శనివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో అనుమానిత కారును ఆపడంతో.. దుండగుడు దిగి తుపాకీ పలు రౌండ్లపాటు కాల్పులు జరిపాడని.. దీంతో పోలీసు అధికారి మరణించినట్లు ఇండియానా పోలీసులు తెలిపారు. నిందితుడికి క్రిమినల్ రికార్డ్ కూడా ఉన్నట్లు తెలిపారు.

లాస్ ఏంజెల్స్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి

లాస్ ఏంజెల్స్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. లాస్ ఏంజెల్స్‌లోని ఓ పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్కులో ఓ షో జరుగుతోంది. ఈ సమయంలో, దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ఏడుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అందరినీ ఆసుపత్రిలో చేర్చారు. అయితే, తీవ్రంగా గాయపడిన వారిద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఇవి కూడా చదవండి

అమెరికాలో రోజుకో కాల్పుల ఘటన నమోదవుతోంది. తుపాకీ నియంత్రణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశంలో కాల్పుల ఘటనలు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడాది అమెరికాలో 300కు పైగా కాల్పుల ఘటనలు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం