Viral News: వయసు చూస్తే 27 ఏళ్లు.. పైకేమో 10 ఏళ్ల పిల్లాడు.. ఇది వరం కాదు.. అతడికి శాపం.
చైనాలో నివసిస్తున్న వ్యక్తి తన వయస్సు కంటే చిన్నవాడుగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఇది అతనికి అది వరం కాదు శాపంగా మారింది.
Young Man in China: ప్రపంచంలో చాలామంది తమ వయసుని అంగీకరిస్తూ.. కాలానికి అనుగుణంగా కనిపించాలనుకునేవారు తక్కువమంది ఉంటారు.. ఎక్కువమంది.. తమ వయసు కంటే తక్కువ వయసున్నట్లు.. యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకోసం వివిధ రకాల క్రీములను ఉపయోగిస్తారు.. లేదా అనేక రకాలుగా ప్రయత్నిస్తారు. కొంతమంది తమ అసలు వయస్సును దాచడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు.. అయినప్పటికీ కాలంలో వచ్చే మార్పుల్లో భాగంగా వృద్ధాప్యం అనివార్యం. దీనిని ఎవరూ ఆపలేరు. అది ప్రకృతి నియమం. అయితే ఒక వ్యక్తి తన వయస్సు కంటే తక్కువగా కనిపిస్తున్నాడు. చైనాలో నివసిస్తున్న వ్యక్తి తన వయస్సు కంటే చిన్నవాడుగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఇది అతనికి అది వరం కాదు శాపం. వైద్య శాస్త్రంలో విచిత్రమైన కేసుగా పరిగణిస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే..
చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో నివసించే మావో షెంగ్ వయసు 27 ఏళ్లు. అయితే 10 ఏళ్ల పిల్లవాడిలా కనిపిస్తున్నాడు. దీంతో అతనికి ఉద్యోగం దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఏ కంపెనీకి ఉద్యోగం కోసం వెళ్లినా అతడిని చిన్నపిల్లాడిలా భావించి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఇంటర్వ్యూ కాల్ వస్తే చాలు మావో ఎగిరి గంతేస్తాడు. అయితే ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తే.. అక్కడ నిరాశకు ఎదురవుతుంది.
వ్యక్తిని చూస్తే ఎవరైనా మోసపోతారు: మావో షెంగ్ తన సమస్యను ప్రజలకు చెప్పాడు. ప్రస్తుతం మనో గురించి ఓ కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అతని చిత్రాలను చూసి.. మీరు కూడా మావో షెంగ్‌ను చిన్నపిల్లగా భావించి మోసపోతారు.
ఉద్యోగం దొరకడం లేదు మీడియా నివేదికల ప్రకారం.. తాను చాలా కాలంగా ఉద్యోగం కోసం చూస్తున్నానని మావో షెంగ్ చెప్పాడు. అతని స్నేహితులందరికీ ఉద్యోగాలు వచ్చాయి. స్నేహితులందరూ కలిసి మావో కోసం ఉద్యోగం వెతకడం ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకూ ఉద్యోగం దొరకలేదు. మావోని తమ కంపెనీలో నియమించుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. తన కచ్చితమైన వయసును ఎవరికీ చెప్పినా ఎవరూ నమ్మడం లేదని వాపోతున్నాడు. అతని చిత్రాలు, కథ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతనికి ఉద్యోగం ఆఫర్లు వెల్లువెత్తాయి. ఉద్యోగ ఇవ్వడానికి ఓ కంపెనీ అంగీకరించినట్లు సమాచారం.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..