Viral Photo: బుర్ర గిర్రున తిరుగుద్ది.. ఈ ఫోటోలో ‘9’ నెంబర్ కనిపెడితే మీరే జీనియస్.. ట్రై చేయండి!

పైకి చూస్తే మాములు ఫోటోలు లాగానే కనిపిస్తాయి. అయితే అందులో ఇంకొన్ని చిత్రాలు దాగుంటాయి.

Viral Photo: బుర్ర గిర్రున తిరుగుద్ది.. ఈ ఫోటోలో '9' నెంబర్ కనిపెడితే మీరే జీనియస్.. ట్రై చేయండి!
Spot The Answer
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 31, 2022 | 12:45 PM

సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే అప్పుడప్పుడూ కొన్ని ఫోటోలు నెట్టింట చూస్తే.. అవి అసలెందుకు వైరల్ అవుతున్నాయా.? అనిపిస్తుంది. పైకి చూస్తే మాములు ఫోటోలు లాగానే కనిపిస్తాయి. అయితే అందులో ఇంకొన్ని చిత్రాలు దాగుంటాయి. అవి మన కళ్ళను మోసం చేస్తుంటాయి. ఇక ఇలాంటి ఫోటోలను ఆప్టికల్ ఇల్యూషన్(Optical Illusion) చిత్రాలని అంటారు. వీటిల్లో పైకి కనిపించే దృశ్యాలు ఒకటి.. లోపల ఉండేవి మరొకటి. వాటిని కనిపెట్టాలంటే మన బుర్ర గిర్రున తిరగాల్సిందే. మరి లేట్ ఎందుకు ఇటీవల ఇంటర్నెట్‌లో ఓ ఫోటో పజిల్ వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం..

పైన పేర్కొన్న ఫోటోలో ఎక్కడ చూసినా ‘8’ నెంబర్ ఉంది కదూ.! అయితే వెయిట్.. వాటి మధ్య ‘9’ నెంబర్ కూడా ఉంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. చూడటానికి ఈజీగా అనిపించినా.. కొంచెం కష్టం బాసూ.! మీ కళ్లకు పవర్ ఉంటే.. చిటికెలో కనిపెడతారు. లేదా.. ఆ పజిల్ మీ కళ్ళను మోసం చేసేస్తుంది. లేట్ ఎందుకు ఓసారి మీరూ ట్రై చేయండి. కనిపెట్టడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఎంత వెతికినా సమాధానం దొరక్కపోతే.. కింద ఫోటో చూడండి.