Viral Video: మళ్లీ అదే వ్యధ.. అంబులెన్స్ ఇవ్వని సిబ్బంది.. డబ్బుల లేక కొడుకు శవంతో 35 కిమీ నడిచిన తల్లిదండ్రులు..

కుమారుడి మృతదేహాన్ని మోసుకెళ్లే సమయంలో బాలుడి తండ్రి అలసిపోతే.. అప్పుడు తల్లి.. ఆ బాలుడి శవాన్ని తాను భుజం మార్చుకుంది. అయితే ఇదంతా రోడ్డుమీద ఉన్న అనేకమంది బాటసారులు చూస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ అయ్యో అంటూ సాయం మాత్రం చేయలేదు.

Viral Video: మళ్లీ అదే వ్యధ.. అంబులెన్స్ ఇవ్వని సిబ్బంది.. డబ్బుల లేక కొడుకు శవంతో 35 కిమీ నడిచిన తల్లిదండ్రులు..
Uttar Pradesh
Follow us

|

Updated on: Aug 03, 2022 | 3:52 PM

Viral Video: మనిషి అంబరాన్ని తాకుతున్నాడు. సముద్రం లోతులను కొలుస్తున్నాడు.. ప్రకృతికి సవాల్ విసురుతూ కృత్రిమ మేథస్సుతో అద్భుతాలను సృష్టిస్తున్నాడు. కానీ మనిషి మానవత్వం ఉన్న మనిషిగా జీవించడం మరచిపోయాడు. సమాజంలో రోజురోజుకీ పేద, ధనిక అనే అంతరాలు పెరిపోతున్నాయి. పేదవారు దయనీయమైన స్థితిలో బతుకు వెళ్లదీస్తున్నారు.. తాజా ఓ బాలుడి మృత దేహాన్ని  తండ్రి తన భుజం మీద మోసుకుని సుమారు 35 కిలోమీటర్లు తీసుకుని వెళ్ళాడు.. ఈ సమయంలో రోడ్డుమీద అనేక మంది ప్రయాణీకులు చూస్తూనే ఉన్నారు.. ప్రేక్షకులుగా మిగిలిపోయారు.. కనీసం సాయం చేయడానికి కూడా ప్రయత్నించలేదు.. ఈ మానవాళికి అవమానకరమైన సంఘటన  ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో  చోటు చేసుకుంది.

కర్చన తహసీల్‌లోని దేహా గ్రామానికి చెందిన  పదేళ్ల బాలుడు విద్యుత్ స్తంభం వద్ద కరెంట్ షాక్ కొట్టంతో  తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం స్వరూపాణి నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని తన స్వగ్రామం తీసుకుని వెళ్ళడానికి ఆస్పత్రి యాజమాన్యాన్ని తండ్రి అంబులెన్స్ అర్ధించాడు.. కానీ ఆసుపత్రి సిబ్బంది స్పందించలేదని మృతుడి తండ్రి ఆరోపించాడు.

ఇవి కూడా చదవండి

మృతదేహాన్ని తీసుకుని వెళ్ళడానికి తన వద్ద డబ్బులు లేవని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్ని సార్లు అభ్యర్థన చేసినా అంబులెన్స్ ను ఆస్పత్రి సిబ్బంది ఏర్పాటు చేయలేదు. దీంతో తన కొడుకు మృతదేహాన్ని తన భుజంపై మోసుకుని తీసుకుని వెళ్లడం తప్ప ఆ తండ్రికి వేరే మార్గం కనిపించలేనట్లు తెలుస్తోంది.

బాటసారులెవరూ సహాయం చేయలేదు

డబ్బు లేకపోవడంతో తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని భుజంపై వేసుకుని కర్చన తహసీల్‌లోని దేహా గ్రామంలోని తన ఇంటికి బయలుదేరాడు. ఓ పక్కన కొడుకుని పోగొట్టుకున్న వేదన.. మరోవైపు కనీసం శవాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి డబ్బులేని బాధను అనుభవిస్తూ.,. తండ్రి నిస్సహాయ స్థితిలో తండ్రి.. తన  కొడుకు మృతదేహాన్ని SRN ఆసుపత్రి నుండి దిహా గ్రామానికి తన భుజంపై మోసుకెళ్లాడు . ఈ క్రమంలో అలా శవంతో 35 కిలోమీటర్లు ప్రయాణించాడు. కుమారుడి మృతదేహాన్ని మోసుకెళ్లే సమయంలో బాలుడి తండ్రి అలసిపోతే.. అప్పుడు తల్లి.. ఆ బాలుడి శవాన్ని తాను భుజం మార్చుకుంది. అయితే ఇదంతా రోడ్డుమీద ఉన్న అనేకమంది బాటసారులు చూస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ అయ్యో అంటూ సాయం మాత్రం చేయలేదు. ఈ సమయంలో అందరూ ప్రేక్షకులుగానే చూస్తూ ఉన్నారు. బాలుడు మృతదేహాన్ని భుజంపై మోస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియో వైరల్ కావడంతో, వైరల్ వీడియో ఆధారంగా, ప్రయాగ్‌రాజ్ కమిషనర్ ఈ విషయంపై విచారణకు ఆదేశించారు. ఎవరైనా దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..